రజినీకాంత్‌కు కరోనా పాజిటివ్.. ఏసుకుంటున్న ఫ్యాన్స్!  

Rajinikanth Rohit Roy - Telugu Corona Virus, Kollywood News, Rajinikanth, Rohit Roy

సోషల్ మీడియాలో ఏదైనా వార్త వస్తే అది ఎంత త్వరగా వ్యాపిస్తుందో మనందిరికీ తెలిసిందే.అందుకే ఎవరైనా ఏదైనా వార్తలు రాయాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తుంటారు.

 Rajinikanth Rohit Roy

ఇక సెలబ్రిటీలు ఈ విషయంలో మరింత జాగ్రత్తగా ఉంటారు.కానీ కొన్నిసార్లు వారు పెట్టే పోస్టుల ఎలాంటి వివాదాన్ని సృష్టిస్తాయో తాజాగా ఓ నటుడు చేసిన పోస్ట్ ఉదాహరణగా నిలుస్తుంది.

బాలీవుడ్ నటుడు రోహిత్ రాయ్ తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ పేరుపై ఓ వివాదాస్పద పోస్ట్ చేశాడు.

రజినీకాంత్‌కు కరోనా పాజిటివ్.. ఏసుకుంటున్న ఫ్యాన్స్-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

రజినీకాంత్‌కు కరోనా పాజిటివ్ వచ్చిందని, ప్రస్తుతం ఆయన క్వారంటైన్‌లో ఉన్నారిన పోస్ట్ చేశాడు రోహిత్ రాయ్.

కాగా రోజులో ఎక్కువసార్లు చేతులు కడుక్కోవడం, శానిటైజర్స్ ఉపయోగించడం, పారిశుధ్య చర్యలు తీసుకుంటేనే కరోనా మహమ్మారిని అరికట్టగలమని ఆయన అన్నారు.ఎంతటి గొప్ప వ్యక్తి అయినా తగు జాగ్రత్తలు తీసుకోకపోతే కరోనా బారిన పడాల్సిందే అంటూ రోహిత్ రాయ్ ఈ పోస్ట్ పెట్టుకొచ్చాడు.

అయితే ఇప్పుడు ఇదే పోస్ట్ మనోడికి పెద్ద తలనొప్పిని తీసుకొచ్చింది.మంచి చెప్పాలంటే మామూలుగా కూడా చెప్పొచ్చని, ఇలా ఓ స్టార్ హీరోకు కరోనా పాజిటివ్ వచ్చిందని, ఆయన ఆరోగ్యంపై ఇలాంటి వివాదాస్పద కామెంట్లు చేయడం ఏమిటని తమిళ తంబీలు రోహిత్ రాయ్‌ను తెగ ట్రోల్ చేస్తున్నారు.

ఏదేమైనా పాపులర్ అయ్యేందుకే ఇలాంటి పోస్ట్‌లు పెడతారని, అందుకే వారికి తగిన బుద్ధి చెప్పాలని తలైవా ఫ్యాన్స్ అంటున్నారు.అయితే రజినీకాంత్‌కు కరోనా పాజిటివ్ అనే వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆయన ఫ్యాన్స్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Rajinikanth Rohit Roy Related Telugu News,Photos/Pics,Images..

footer-test