సినిమాల నుంచి రిటైర్మెంట్ తీసుకునే యోచనలో రజినీకాంత్

సూపర్ స్టార్ గా ఐది దశాబ్దాల పాటు అప్రతిహితంగా కోలీవుడ్ లో తన ప్రస్తానం కొనసాగించి ఎన్నో అద్బుతమైన సినిమాలలో నటించిన వ్యక్తి రజినీకాంత్.సౌత్ ఇండియా నుంచి మొదటి సారి హాలీవుడ్ సినిమాలలో నటించిన ఘనత కూడా రజినీకాంత్ సొంతం.ప్రస్తుతం అతని వయస్సు 70 దాటింది.అయిన ఇప్పటికి కూడా అంతే ఉత్సాహంతో సినిమాలు చేస్తున్నారు.తన వయస్సుకి తగ్గ పాత్రలు ఎంచుకుంటున్న కమర్షియల్ హీరోగానే హవా కొనసాగిస్తున్నారు.అలాగే సౌత్ లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోగా ఉన్నారు.

 Superstar Rajinikanth Retirement Plan From Movies, Tollywood, Kollywood, South S-TeluguStop.com

రజినీకాంత్ తో సినిమా అంటే నిర్మాతలు కూడా వంద కోట్లకి పైగానే బడ్జెట్ రెడీ చేసుకోవాల్సిన అవసరం ఉంది.ప్రస్తుతం శివ దర్శకత్వంలో అన్నాత్తై మూవీలో రజినీకాంత్ నటించాడు.

ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.ఇదిలా ఉంటే దీని తర్వాత కార్తిక్ సుబ్బరాజుతో సినిమా చేయడానికి రజిని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

అయితే ఈ మధ్య సూపర్ స్టార్ తరుచుగా అనారోగ్య సమస్యలతో సతమతం అవుతున్నారు.అన్నాత్తై షూటింగ్ సమయంలోనే ఒకసారి అనారోగ్యానికి గురయ్యారు.

ఈ కారణంగానే పార్టీ పెట్టాలనే ఆలోచన కూడా విరమించుకున్నారు.అయితే తాజాగా రజినీకాంత్ తన మనసులోనే మాటని బయట పెట్టారు.

తనకి మరికొంత కాలం సినిమాలలో నటించాలని ఉందని, అయితే ఈ మధ్య అంతగా ఆరోగ్యం సహకరించడం లేదని పేర్కొన్నారు.కరోనా ప్రభావం తగ్గిన తర్వాత మరోసారి ఆరోగ్య పరీక్షలు చేసుకొని అప్పుడు పరిస్థితి బట్టి సినిమాలలో నటించాలా వద్దా అనే నిర్ణయం తీసుకుంటానని పేర్కొన్నారు.

దీనిని బట్టి సూపర్ స్టార్ రజినీకాంత్ రిటైర్మెంట్ ఆలోచనలోనే ఉన్నారని తెలుస్తుంది.అభిమానులు కూడా ఇకపై అతను ఇంకా సినిమాలలో నటించాలనే ఒత్తిడి చేయకపోవచ్చనే మాట కోలీవుడ్ లో వినిపిస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube