శబరిమలైలో మహిళల ఎంట్రీపై మొదటిసారి స్పందించిన 'రజినీకాంత్'.! సంచలన కామెంట్స్ ఇవే.!  

Rajinikanth Responded To Women Entry In Sabarimala Temple-

అన్ని వయస్సుల మహిళలను శబరిమల ఆలయంలోకి అనుమతించాలన్న సుప్రీంకోర్టు తీర్పుపై నిరసనల వెల్లువ కొనసాగుతూనే ఉన్నది. వరుసగా నాలుగో రోజు శనివారం కూడా భక్తుల ఆందోళన కొనసాగింది. మరోవైపు పంబ కొండలపై భారీ వర్షం కురుస్తుండటంతో ఆలయాన్ని దర్శించాలన్న నిర్ణయాన్ని దళిత మహిళా సమాఖ్య అధ్యక్షురాలు మంజు వాయిదా వేసుకున్నారు. ఈ విషయంపై ద‌క్ష‌ణాదిన అగ్ర‌న‌టులైన సూప‌ర్ స్టార్ ర‌జ‌నికాంత్ స్పందించారు. సుప్రీంకోర్ట్ అత్యున్న‌త‌మైన‌ది. ఆ తీర్పును గౌర‌విస్తున్నాం. కానీ అనాదిగా వ‌స్తున్న ఆచారాల‌ను గౌర‌వించాల్సిన భాద్య‌త మీపై కూడా ఉందనీ తలైవా తేల్చిచెప్పారు.

Rajinikanth Responded To Women Entry In Sabarimala Temple-

Rajinikanth Responded To Women Entry In Sabarimala Temple

ఒక్కో ఆలయానికి ఒక్కోరకమైన సంప్రదాయం, ఆచారవ్యవహారాలు ఉంటాయి. వాటిని మనం గౌరవించాల్సిన అవసరం ఉన్నది. శబరిమల ఆలయంలో కొన్నేండ్లుగా పాటిస్తున్న సంప్రదాయాల్లో ఎవరూ జోక్యం చేసుకోనవసరం లేదు అని శనివారం మీడియాతో రజినీకాంత్ అన్నారు. మహిళలకు సమానంగా హక్కులు కల్పించే విషయమై తనకు రెండో అభిప్రాయమేదీ లేదని తేల్చిచెప్పారు.

అటు దేశాన్ని కుదిపేస్తున్న మీటూ వివాదంపైనా రజనీకాంత్ స్పందించారు. ‘మీటూ’ ఉద్యమంతో మహిళలకు మేలు జరుగుతుందన్నారు. అయితే దీన్ని ఎవరూ దుర్వినియోగం చేయకూడదని చెప్పారు. సరైన రీతిలో మీటూను బాధిత మహిళలు వినియోగించుకోవాలన్నారు.