అలాంటి సాహసం చేయబోతున్న రజనీకాంత్.. అవాక్కైన ఫ్యాన్స్..?

సూపర్ స్టార్ రజినీకాంత్ తన సినీ కెరీర్ లో ఎన్నో ప్రయోగాలు చేసి ఆ ప్రయోగాలతో విజయాలను సొంతం చేసుకున్నారు.దాదాపు నలభై సంవత్సరాలుగా రజినీకాంత్ గా నటుడిగా సత్తా చాటుతుండటం గమనార్హం.

 Rajinikanth Ready To Do Risk For Annaatthe Shoot-TeluguStop.com

వయస్సు పెరుగుతున్నా వరుసగా సినిమాలు చేస్తూ రజినీకాంత్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.ప్రస్తుతం ఈ హీరో అన్నాత్తే సినిమాలో నటిస్తుండగా ఈ సినిమా కోసం రజినీకాంత్ డేరింగ్ స్టెప్ తీసుకుంటున్నారని తెలుస్తోంది.

సిరుత్తై శివ డైరెక్షన్ లో రజినీకాంత్ అన్నాత్తేలో నటిస్తుండగా కళానిధి మారన్ సన్ పిక్చర్స్ బ్యానర్ పై ఈ సినిమాను తెరకెక్కిస్తుండటం గమనార్హం.ఇమ్మాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా కీర్తి సురేష్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తుండటం గమనార్హం.

 Rajinikanth Ready To Do Risk For Annaatthe Shoot-అలాంటి సాహసం చేయబోతున్న రజనీకాంత్.. అవాక్కైన ఫ్యాన్స్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

చాలా కాలం క్రితమే అన్నాత్తే షూటింగ్ మొదలైనా కరోనా, లాక్ డౌన్ వల్ల ఈ సినిమా షూటింగ్ అంతకంతకూ వాయిదా పడుతోంది.

Telugu 100 Fighters, Annathe Movie Update, Annatthe, Corona Second Wave, Keerthy Suresh, Kollywood, Rajinikanth, Rajnikanth Unhealthy, Ready To Risk-Movie

ఈ ఏడాది షూటింగ్ మొదలైనా కరోనా సెకండ్ వేవ్ వల్ల ఈ మూవీ షూటింగ్ కు బ్రేకులు పడ్డాయి.రజినీకాంత్ అనారోగ్యం పాలవడంతో పాటు ఇతర కారణాల వల్ల ఈ మూవీ షూటింగ్ ఆలస్యమైంది.తాజాగా కోల్ కతాలో అన్నాత్తే షూటింగ్ మొదలు కాగా అక్కడే ఈ సినిమా క్లైమాక్స్ ను కూడా షూట్ చేయనున్నారని సమాచారం.

అన్నాచెల్లెలు సెంటిమెంట్ తో ఈ సినిమా తెరకెక్కనుండగా అన్నయ్య అనే టైటిల్ ఈ సినిమాకు ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది.

Telugu 100 Fighters, Annathe Movie Update, Annatthe, Corona Second Wave, Keerthy Suresh, Kollywood, Rajinikanth, Rajnikanth Unhealthy, Ready To Risk-Movie

కొన్ని సంవత్సరాల క్రితం చిరంజీవి హీరోగా తెరకెక్కిన అన్నయ్య సినిమా రిలీజ్ కాగా ఆ సినిమా సక్సెస్ సాధించింది.ఈ సినిమా క్లైమాక్స్ సీన్ లో 100 మంది ఫైటర్లు పాల్గొంటున్నారని కరోనా రిస్క్ ఉన్నా రజినీకాంత్ మాత్రం షూటింగ్ లో పాల్గొనడానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది.రజినీకాంత్ చేస్తున్న సాహసాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

#AnnatheMovie #Rajinikanth #Ready To Risk #Kollywood #Keerthy Suresh

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు