అవుట్ డేటెడ్ కాంబో.. మళ్ళీ వర్కౌట్ అవుతుందా..

మన ఇండస్ట్రీలో హిట్ కాంబినేషన్ లు అనేవి చాలానే ఉన్నాయి.అందులో ఎవర్ గ్రీన్ హిట్ కాంబో లలో ఒకటి.

 Rajinikanth Ramya Krishna Movie, Rajinikanth, Ramya Krishna, Jailor, Narasimha Movie ,kollywood , Tollywood , Ks Ravikumar Saundharya ,nelson Dilip Kumar-TeluguStop.com

రజనీకాంత్ – రమ్య కృష్ణ.వీరిద్దరి కాంబో దశాబ్దాల క్రితం సంచలనం సృష్టించింది.

అయితే అప్పుడు ఎవర్ గ్రీన్ గా నిలిచిన ఈ కాంబో ఇప్పుడు ఆ స్థాయి మ్యాజిక్ చేస్తుంది అంటే కష్టమే అనే మాట వినిపిస్తుంది.

 Rajinikanth Ramya Krishna Movie, Rajinikanth, Ramya Krishna, Jailor, Narasimha Movie ,Kollywood , Tollywood , KS Ravikumar Saundharya ,Nelson Dilip Kumar-అవుట్ డేటెడ్ కాంబో.. మళ్ళీ వర్కౌట్ అవుతుందా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కోలీవుడ్ స్టార్ హీరోల్లో రజనీ కాంత్ ఒకరు.

ఈయనకు టాలీవుడ్ లో మాత్రమే కాదు.ఇండియా వైడ్ ఫాలోయింగ్ ఉంది.

ఇక తమిళ నాడు లో అయినా ఈయన ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన అవసరం కూడా లేదు.ఈయన సినిమా అంటే ముందే నుండే భారీ క్రేజ్ ఉంటుంది.

థియేటర్ ల దగ్గర ఫ్యాన్స్ సందడి మాములుగా ఉండదు.ఇది వరకు ఈయన సినిమాలు వస్తున్నాయి అంటే థియేటర్ల దగ్గర పెద్ద క్యూ ఉండేది.

అలాగే రమ్యకృష్ణ కూడా స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది.వీరిద్దరూ కలిసి నటించిన సినిమా నరసింహ.1999లో రిలీజ్ అయినా ఈ సినిమా తెలుగు, తమిళ్ లో సంచలనం సృష్టించింది. కె ఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన నరసింహ రజనీ కాంత్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచి భారీ వసూళ్లు కూడా రాబట్టి అప్పటి వరకు ఉన్న రికార్డులను తిరగరాసింది.

Telugu Jailor, Kollywood, Ksravikumar, Simha, Rajinikanth, Ramya Krishna, Tollywood-Movie

ఇందులో సౌందర్య హీరోయిన్ గా నటించగా రమ్య కృష్ణ నీలాంబరి పాత్రలో నెగిటివ్ రోల్ చేసింది.రజనీ కాంత్, రమ్యకృష్ణ పోటీ పడి మరీ నటించారా అనే సందేహం ప్రేక్షకులకు కలిగింది.అయితే ఈ సినిమా తర్వాత వీరి జంట మరో సినిమాలో కనిపించలేదు.ఇన్నాళ్లకు ఈ ఇద్దరు కలిసి నటిస్తున్నారు అని తెలుస్తుంది.

Telugu Jailor, Kollywood, Ksravikumar, Simha, Rajinikanth, Ramya Krishna, Tollywood-Movie

రజనీ కాంత్ జైలర్ సినిమాలో రమ్య కృష్ణ కూడా నటిస్తుంది అని తెలుస్తుంది.అయితే ఈమెది ఏ రోల్ అనేది తెలియలేదు.ఈ సినిమాను నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్టర్ చేస్తుండగా సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు.మరి ఈ జంట మరోసారి మ్యాజిక్ చేస్తుందో లేదో చూడాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube