ఎన్టీఆర్ స్టార్ అవుతాడని రజినీకాంత్ ఆనాడే జోష్యం చెప్పారా.. ?

Rajinikanth Prediction About Jr Ntr

చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి తెలియని వారంటూ ఉండరు.ఆయన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు.

 Rajinikanth Prediction About Jr Ntr-TeluguStop.com

రజినీకాంత్ తమిళంతో పాటు ఇతర భాషల్లో అభిమానులను సంపాదించుకున్నారు.ఇక విజయ, పరాజయలతో సంబంధం లేకుండా నిమా సినిమాకు క్రేజ్ ను పెంచుకున్నాడు రజినీకాంత్.

ఇక ప్రస్తుతం రజినీకాంత్ అన్నాత్తే సినిమాలో నటిస్తున్నారు.

 Rajinikanth Prediction About Jr Ntr-ఎన్టీఆర్ స్టార్ అవుతాడని రజినీకాంత్ ఆనాడే జోష్యం చెప్పారా.. -Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక ఇండస్ట్రీలో భాషతో సంబంధం లేకుండా కథ నచ్చితే సినిమాను రీమెక్ చేస్తుంటారు.

అలాగే రజినీకాంత్ కూడా ఓ సినిమాలో రీమెక్ నటించే అవకాశం వచ్చింది.అయితే ఇంతకీ ఆ సినిమా ఏంటో ఒక్కసారి చూద్దామా.

తెలుగు చిత్ర పరిశ్రమలో రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన సినిమా సింహాద్రి.ఈ సినిమా ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ పొందింది.

అయితే సింహాద్రి సినిమాను చూసిన రజనీకాంత్ 20 ఏళ్ల వయస్సులోనే ఎన్టీఆర్ ఆ పాత్రలో అద్భుతంగా నటించిన తీరును చూసి ఆశ్చర్యపోయారు.

అయితే భవిష్యత్తులో ఎన్టీఆర్ కు సరిపోయే కథలు దొరకడం అంత తేలిక కాదని కామెంట్లు చేశారు.

అయితే రజనీకాంత్ సింహాద్రి రీమేక్ లో నటించే సాహసం చేయలేకపోయారు.తరువాత కాలంలో ఆ సినిమాను విజయ్ కాంత్ రీమేక్ చేయగా అక్కడ ఆ సినిమా ఫ్లాప్ గా నిలిచింది.

రజనీకాంత్ ఊహించినట్లే జూనియర్ ఎన్టీఆర్ కు ఒక దశలో సరైన కథలు దొరకడం కష్టమైంది.శక్తి నుంచి రభస వరకు ఎన్టీఆర్ కు వరుస ఫ్లాపులు పలకరించాయి.’

ఇక రజనీకాంత్ జోస్యం తారక్ విషయంలో కొన్నేళ్ల క్రితం వరకు నిజమైనా టెంపర్ సినిమా నుంచి విజయాలు అందుకుంటూ తారక్ సక్సెస్ కు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్నారు.ఫ్యూచర్ ప్రాజెక్ట్ లను కూడా జాగ్రత్తగా ఎంపిక చేసుకుంటూ నంబర్ 1 స్థానానికి తారక్ గట్టి పోటీని ఇస్తున్నారు.

ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

#Vijay Kant #Temper #Simhadri #Tarak #Rajinikanth

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube