అభిమానుల ఆశలను మళ్లీ నీరు గార్చిన సూపర్ ‌స్టార్‌

తమిళ సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ రాజకీయాల్లోకి రాబోతున్నట్లుగా గత పది పదిహేను సంవత్సరాలుగా వార్తలు వస్తూనే ఉన్నాయి.రజినీకాంత్‌ అదుగో రాజకీయాల్లోకి రాబోతున్నాడు ఇదుగో వచ్చేశాడు అంటూ ప్రచారం జరిగింది.

 Rajinikanth Political Entry News,rajinikanth, Political Entry, Kamal Haasan, Ass-TeluguStop.com

నాలుగు ఏళ్ల క్రితం అమ్మ జయలలిత మృతి చెందిన సమయంలో రజినీకాంత్‌ రాజకీయ ఎంట్రీ కన్ఫర్మ్‌ అనుకున్నారు.అనుకున్నట్లుగానే రెండు సంవత్సరాల క్రితం ఆయన రాజకీయాల్లోకి రాబోతున్నట్లుగా ప్రకటించాడు.

అందుకు సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా పేర్కొన్నాడు.అయితే ఇప్పటి వరకు రజినీకాంత్‌ రాజకీయ ఎంట్రీ ఆయన పార్టీ గురించి ఎలాంటి ప్రకటన లేదు.

గత రెండేళ్లుగా ఊరించిన రజినీకాంత్‌ మళ్లీ నిరాశ పర్చాడు.ఆయన వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తాడంటూ అంతా భావించారు.

కాని రజినీకాంత్‌ వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు దూరంగా ఉండే అవకావాలు కనిపిస్తున్నాయి.రజినీకాంత్‌ ఇప్పటికే అభిమానులను చాలా వెయిట్‌ చేయించాడు.

ఈసారి ఎన్నికలకు ఆయన ఖచ్చితంగా పోటీ చేస్తాడని అంతా భావించినా కూడా నిరాశే పర్చాడు.

ఆయన తీరుపై ఇప్పటికే విమర్శలు వస్తున్నాయి.

నా వల్ల కాదు అంటే ఒక్క మాటతో తేలిపోతుంది.కాని వస్తున్నా టైం చూసి వస్తా అంటూ సినిమా డైలాగ్‌ లు చెప్పి అభిమానులను ఊరిస్తున్నాడు.

ఆయన రాజకీయాల్లోకి వస్తే ఆయన్ను అనుసరించేందుకు లక్షలాది మంది అభిమానులు ఉన్నారు.కనుక రజినీకాంత్‌ రాజకీయాల్లోకి రావడమే మంచిది అనే అభిప్రాయంను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు.

కాని రజినీకాంత్‌ మాత్రం ఏదో భయంతో వెనుక ముందు ఆడుతున్నాడు.

ఇంకా ఎన్ని రోజులు ఇలా వెనుక ముందు ఆడుతాడు అంటూ నెటిజన్స్‌ మరియు తమిళ సినీ వర్గాల వారు కామెంట్స్‌ చేస్తున్నారు.

కొంత మందిని చూసిన తర్వాత రజినీకాంత్‌ కు రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వాలంటేనే భయంగా ఉందని అనిపిస్తుంది అంటున్నారు.తన తోటి నటుడు కమల్‌ హాసన్‌ పార్టీ పెట్టి గెలుపు ఓటములను పక్కన పెట్టి తనవంతు బాధ్యతగా రాజకీయాల్లో కి వచ్చి ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నాడు.

రజినీకాంత్‌ మాత్రం రాజకీయాల్లోకి వస్తే తాను సీఎం అవుతానో కానో అనే అనుమానంతో రాజకీయాలకు దూరంగా ఉంటున్నాడు అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube