సంచలనం సృష్టిస్తున్న రజనీ పార్టీ సింబల్   Rajinikanth Party Symbol Of Creation Sensation     2017-12-31   21:26:18  IST  Bhanu C

తమిళ నాట నిన్నా మొన్నటి వరకూ నడుస్తూ వస్తున్న రాజకీయాలు ఒక ఎత్తయితే..రజనీకాంత్ రాజకీయాలలోకి వచ్చిన తరువాత..మారబోయే సమీకరణాలు మరొక ఎత్తు..జయలలిత ఎప్పుడైతే మృతి చెందిందో అప్పుడే తమిళ రాజీయాలు చిన్నాభిన్నం అయ్యాయి…ఇప్పుడు రజనీ రాజకీయాల్లోకి రావడానికి..వస్తే సక్సెస్ అవ్వడానికి ఉన్న ఒకే ఒక ఫార్ములా తమిళ నాట ఏ పార్టీ కూడా పటిష్టంగా లేకపోవడమే.

రజనీకాంత్ రాజకీయ ఎంట్రీ పై చేసిన ప్రసంగం ఎంతో మంది తమిళులని తనవైపుకి తిప్పుకునేలా చేసింది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు…ఇప్పటికే రజనీ పార్టీకి కావాల్సిన క్రేజ్ అంతా పక్కా ప్లాన్డ్ గా తెచ్చుకున్నాడు ..ఇప్పుడు తానూ ప్రకటించబోయే విదివిదానాలకి ప్రజలు మరింత కనెక్ట్ అయ్యేలా చూసుకోవడమే రజనీ ముందు ఉన్న లక్ష్యం..అయితే నేను ఇచ్చిన హామీలని గెలిచినా మూడేళ్ళలో కనుకా నెరవేర్చక పొతే స్వచ్చందంగా రాజీనామా చేసేస్తాను అంటూ ప్రకటించడం రజనీ స్టైల్ కి కమిట్మెంట్ కి నిదర్సనం అనే చెప్పాలి..తమిళనాడులో ఎక్కడ చూసినా రజనీ ప్రసంగం గురించే చర్చ నడుస్తుంటే..మరో పక్క ఇంకో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది..అదేమిటంటే…

రజనీకాంత్ పార్టీ సింబల్ ఏమి అయ్యిఉంటుంది అని..ఇప్పటికే రజనీ పార్టీ సింబల్ మీద ఒక గుర్తు డిసైడ్ అయ్యాడట..తానూ అనుకున్న గుర్తు కూడా ప్రజలలో ఇప్పటికే నాటుకు పోయింది అంటున్నారు..అయితే తన పార్టీలో ని ముఖ్యమైన వ్యక్తులతో రజనీ మరింతగా చర్చించిన తరువాత బయటకి చెప్తారని తెలుస్తోంది..అయితే విశ్వసనీయ సమాచారం మేరకు తెలుస్తున్న విషయం ఏమిటి అంటే..బాబా సినిమాలో రజనీ చాలా స్టైల్ గా పిడికిలి బిగించి రెండు వేళ్ళని పైకి చూపుతూ ఆధ్యాత్మిక చిహ్నం చూపిస్తాడు కదా అదే రజనీ పార్టీ సింబల్ అని టాక్..అంతేకాదు పార్టీ ప్రకటన అయ్యాక చాలా అక్కడే ఉన్న అభిమానులు అదే సింబల్ పైకి ఎత్తి చూపడం..రజనీ కూడ ఆ సమావేశంలో బాబా సింబల్ చూపడం వలన రజనీ పార్టీ సింబల్ ఇదే అంటూ ఊహాగానాలు హల్చల్ చేస్తున్నాయి..ఈ విషయం పై కొద్ది రోజుల్లోనే మరింత క్లారిటీ రానుంది..