బిగ్‌న్యూస్‌ : టీవీ9 ను వీడనున్న రజినీకాంత్‌  

rajinikanth out from tv9, TV9, Rajinikanth, Tv9 CEO Ravi prakash, Teitter, News Channels, - Telugu Ravi Prakash, Telugu Film News, Telugu No.1 News Channel, Tv9, Tv9 Rajinikanth

గత 15 సంవత్సరాలుగా తెలుగులో నెంబర్ వన్ న్యూస్ ఛానల్ గా కొనసాగుతూ వస్తున్న టీవీ9 లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.రెండేళ్ల కిందట టీవీ9 యాజమాన్యం మార్పు చెందినప్పటి నుండి ఇప్పటి వరకు పలు మార్పులు చేర్పులు వచ్చాయి.ముఖ్యంగా టీవీ9 ఛానెల్‌ ను ఈ స్థాయికి తీసుకొచ్చిన మాజీ సీఈవో రవిప్రకాష్ ను తొలగించడంతో పాటు ఆయన అనునయులను కూడా తొలగించారు.

TeluguStop.com - Rajinikanth Out From Tv9

టీవీ9 ను పూర్తిగా తమ అధీనంలోకి తీసుకునేందుకు కొత్త యాజమాన్యం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది.అందులో భాగంగానే ప్రస్తుతం టీవీ9లో కీలకంగా ఉన్న రజనీకాంత్ కు కూడా ఉద్వాసన పలికేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు మీడియా సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది.రవి ప్రకాష్ వెళ్లిపోయిన తర్వాత కూడా టీవీ9 నెంబర్‌ 1 హోదాలో కొనసాగడంలో రజనీకాంత్ ది కీలక పాత్ర అనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఆయన నిర్వహించే న్యూస్ బులెటిన్లు మరియు ఇతర కార్యక్రమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి.ఆ కారణంగానే టీవీ9 కి ఇంకా ప్రేక్షకుల ఆదరణ ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు.

TeluguStop.com - బిగ్‌న్యూస్‌ : టీవీ9 ను వీడనున్న రజినీకాంత్‌-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఇలాంటి సమయంలో యాజమాన్యం రజనీకాంత్ కు ప్రాధాన్యత తగ్గించి మరో సీనియర్ రిపోర్టర్ అయిన మురళి కృష్ణ కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు గా తెలుస్తోంది.అది నచ్చని రజినీకాంత్ మెల్లగా టీవీ9 వదిలేసే విషయమై ఆలోచిస్తున్నారట.

ఇప్పటికే ఆయన టీవీ9 యాజమాన్యానికి ఈ విషయం చెప్పినప్పటికీ అధికారికంగా మాత్రం ఇంకా బయటికి తెలియజేయలేదు.తన ట్విట్టర్ మరియు ఇతర సోషల్ మీడియా అకౌంట్లలో ఇంకా తాను టీవీ9 లో చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

వాటిని మార్చినట్లయితే అప్పుడు అధికారికంగా ఆయన టీవీ9 నుండి తప్పుకున్నట్లు గా భావించవచ్చును.

నిజంగానే రజినీకాంత్ టీవీ9 వీడినట్లయితే ఆయన ఖచ్చితంగా రవిప్రకాష్ తో కలిసే అవకాశం ఉంది.

రవి ప్రకాష్ ప్రస్తుతం ఒక న్యూస్ ఛానల్ ని తీసుకొని దాన్ని టీవీ 9 కి పోటీగా తయారు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.ఆయనకు రజినీకాంత్ తోడైతే కచ్చితంగా వారిద్దరూ అనుకున్నది సాధ్యమవుతుంది.15 ఏళ్ల సుదీర్ఘ కాలం పాటు నెంబర్ 1 స్థానంలో నిలిచిన టీవీ9 ఈ పరిణామాలతో దూరం వెళ్లాల్సి వస్తుందేమో అని మీడియా సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

#TeluguNo.1 #Ravi Prakash #Tv9 Rajinikanth

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Rajinikanth Out From Tv9 Related Telugu News,Photos/Pics,Images..