రామోజీలో మొదలెట్టిన రజినీకాంత్! భారీ యాక్షన్స్ తో స్టార్ట్  

Rajinikanth Movie Shooting Started In Ramoji Film City - Telugu Kollywood, Rajinikanth Movie Shooting, Ramoji Film City, South Cinema, Tollywood

సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం తమిళ స్టార్ దర్శకుడు శివతో సినిమా చేస్తున్నాడు.ఇప్పటికే ఈ సినిమా ఓపెనింగ్ జరుపుకుంది.

Rajinikanth Movie Shooting Started In Ramoji Film City - Telugu Kollywood South Cinema Tollywood

ఇక భారీ అంచనాలతో వచ్చిన దర్బార్ సినిమా ఫ్లాప్ తర్వాత రజినీకాంత్ మరోసారి యాక్షన్ హీరోగా చేస్తున్న సినిమా ఇదే కావడం విశేషం.అయితే దర్బార్ నెగిటివిటీ ఈ సినిమా కొంత పేస్ చేస్తుంది.

అతని ఇమేజ్ ని ఈ తరం దర్శకులు ఎవరు అందుకోలేకపోతున్నారని, అందుకే రజినీకాంత్ సినిమాలు ఈ మధ్యకాలంలో దారుణంగా దెబ్బ తింటున్నాయని టాక్ వినిపిస్తుంది.ఈ నేపధ్యంలో మరోసారి యాక్షన్ కథాంశంతో శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు ఇందులో రజినీకాంత్ కి జోడీగా ఖుష్బూ, మీనా హీరోయిన్స్ గా నటిస్తూ ఉండగా రజినీకాంత్ కూతురు పాత్రలో కీర్తి సురేష్ నటిస్తుంది.

ఇందులో హీరో సిద్దార్ధ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు.ఇక ఈ సినిమాలో రజినీకాంత్ తో పోటీపడే విలన్ పాత్ర కోసం టాలీవుడ్ హీరోలైన కార్తికేయ, నవదీప్ పేర్లు పరిశీలిస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది.

అయితే అఫీషియల్ గా దర్శకుడు ఈ విషయాన్ని ఇంకా కన్ఫర్మ్ చేయలేదు.ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో రామోజీ ఫిల్మ్ సిటీలో తాజాగా ప్రారంభం అయ్యింది.

ఫిల్మ్ సిటీలో వేసిన పబ్ సెట్ లో భారీ యాక్షన్ సీక్వెన్స్ ని రజినీకాంత్ మీద దర్శకుడు శివ చిత్రీకరిస్తున్నారు.ఈ ఫైట్ కోసం భారీగా ఖర్చు పెట్టినట్లు తెలుస్తుంది.

సన్ పిక్చర్స్ సంస్థ ఈ సినిమాని నిర్మిస్తుంది.డి.ఇమ్మాన్ ఈ సినిమాకి స్వరాలు అందిస్తున్నారు.

తాజా వార్తలు