టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) హీరోగా నటిస్తున్న దేవర సినిమా( Devara ) ఇప్పటికే థియేటర్లలో విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడిన విషయం తెలిసిందే.ఈ సినిమా అక్టోబర్ 10 విడుదల కానుంది.
ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.అయితే ఈ సినిమాకు ఇప్పటివరకు బాక్సాఫీస్ వద్ద మరో సినిమా పోటీ లేదు అనుకుని ఎక్కువగా ఉన్నారు.
కానీఈ సినిమాకు పోటీ మొదలయ్యింది.ఎన్టీఆర్ కు పోటీగా ఏకంగా స్వయంగా రజనీకాంత్( Rajinikanth ) రంగంలోకి దిగుతున్నారు.
జ్ఞానవేల్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నారు రజినీకాంత్.

ఈ సినిమాను అక్టోబర్ లో విడుదల చేయబోతున్నట్టు తాజాగా ప్రకటించారు.అయితే డేట్ ని మాత్రం ఇంకా వెల్లడించలేదు.అంటే సాధారణంగా దసరాకే విడుదల చేస్తారు.
అదే కనుక జరిగితే ఎన్టీఆర్ రజనీకాంత్ మధ్య బాక్సాఫీస్ వార్ తప్పకపోవచ్చు.నిజానికి నిన్నమొన్నటివరకు రజనీకాంత్ అస్సలు ఎవ్వరికీ పోటీ కాదు.
ఆయన సినిమాను టాలీవుడ్ చాలా లైట్ తీసుకుంది.కానీ జైలర్( Jailer ) తర్వాత రజనీకాంత్ సినిమాపై కూడా టాలీవుడ్ మేకర్స్ దృష్టి పెట్టడం మొదలుపెట్టారు.
ఇప్పుడు దేవర యూనిట్ మరింత ఎక్కువ దృష్టి పెట్టాల్సిన టైమ్ వచ్చింది.

ఈసారి రజనీకాంత్ మూవీ భారీ సెటప్ తో వస్తోంది.అమితాబ్ బచ్చన్, ఫహాద్ ఫాజిల్, దగ్గుబాటి రానా, రావు రమేష్ లాంటి నటులు ఇందులో ఉన్నారు.అనిరుధ్ మ్యూజిక్ ఉండనే ఉంది.
అందుకే ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.ఈ సినిమాకు తమిళ్ లో వేట్టయాన్( Vettaiyan ) అనే టైటిల్ పెట్టారు.
మరి ఒకవేళ రజినీకాంత్ ఎన్టీఆర్ లు ఇద్దరు ఒకేసారి బాక్సాఫీస్ వద్ద పోటీపడితే ఈ ఇద్దరిలో ఎవరు గెలుస్తారో ఎవరు ఊరుతారో చూడాలి మరి.