వాళ్ళిద్దరిని కృష్ణార్జునులుతో పోల్చిన సూపర్ స్టార్ రజినీకాంత్  

Rajinikanth Likens Pm Modi And Amit Shah To Krishna And Arjuna-

ప్రస్తుతం దేశ రాజకీయాలలో ప్రధాని మోడీ, అమిత్ షా జోడీ టాప్ ట్రెండ్ లో ఉంది. రాజకీయంగా బీజేపీ పార్టీని ఓ వైపు అగ్రస్థానంలో నిలబెడుతూ మరో వైపు దేశ ప్రజల అభిమానం చూరగొంటున్న వీళ్ళిద్దరిని ప్రజలు ఇప్పటికే ఆకాశానికి ఎత్తేసారు. అయితే ఇక మోడీ-అమిత్ షా టీం ప్రభావం ఇప్పుడు దేశం యావత్తు కనిపిస్తుంది..

వాళ్ళిద్దరిని కృష్ణార్జునులుతో పోల్చిన సూపర్ స్టార్ రజినీకాంత్-Rajinikanth Likens PM Modi And Amit Shah To Krishna And Arjuna

ఇదిలా ఉంటే తాజాగా వీల్లిద్దరిని సూపర్ స్టార్ రజినీకాంత్ కృష్ణార్జునులు పోల్చడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దేశ రాజకీయాలలో మోడీ, అమిత్ షా జోడీ కృష్ణార్జునులు మాదిరి తమ ప్రభావం చూపిస్తున్నారని రజినీకాంత్ ప్రశంసలు కురిపించారు.

ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు రాసిన ‘లిజనింగ్‌.

లెర్నింగ్‌.లీడింగ్‌’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్న రజినీకాంత్ మాట్లాడుతూ మిషన్‌ కశ్మీర్‌కు హృదయపూర్వక శుభాకాంక్షలు. పార్లమెంటులో అమిత్‌షా ప్రసంగం అద్భుతంగా సాగింది. అమిత్‌ షా- మోదీ ఇద్దరూ కృష్ణార్జున కాంబినేషన్‌లాంటి వారు.

ఎవరెలాంటి వారో వారికి మాత్రమే తెలుసు. మీకంతా శుభాలే కలగాలి’ అని అన్నారు. వెంకయ్య గురించి మాట్లాడుతూ.

‘ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఎప్పుడూ ప్రజా సంక్షేమం కోసమే ఆలోచిస్తుంటారు. ఆయనోగొప్ప ఆధ్యాత్మిక వేత్త’ అని కొనియాడారు.

ఇప్పటికే సూపర్ స్టార్ ఆర్టికల్ 370 రద్దుకి మద్దతు తెలపడంతో పాటు, ఇప్పుడు బీజేపీ పార్టీ అభ్యర్దులైన మోడీ, అమిత్ షాలని పొగడంతో త్వరలో రజిని బీజేపీ పార్టీలో చేరే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది.