సూపర్‌ స్టార్‌కు అరుదైన గౌరవం.. ఏ హీరోకు ఇలా జరగలేదు

తమిళ సెన్షేషనల్‌ స్టార్‌ రజినీకాంత్‌ ఇప్పటి వరకు ఎన్నో అత్యున్నత శిఖరాలను అధిరోహించాడు.ఒక కార్పెంటర్‌గా పని చేసిన రజినీకాంత్‌ ప్రస్తుతం వేల కోట్ల ఆస్తికి యజమాని అవ్వడంతో పాటు, దేశ వ్యాప్తంగా అత్యధిక ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ను కలిగి ఉన్న హీరోల జాబితాలో ఉన్నాడు.

 Rajinikanth Life History In Tamil Nadu School Books-TeluguStop.com

అద్బుతమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌తో పాటు కష్టపడే తత్వం ఉన్న రజినీకాంత్‌ ఎన్నో అవార్డులు, రివార్డులు, గౌరవాలు పొందారు.ఇప్పుడు మరోసారి రజినీకాంత్‌కు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం అరుదైన గౌరవంను కట్టబెట్టింది.

సూపర్‌ స్టార్‌కు అరుదైన గౌరవ�

రజినీకాంత్‌ జీవిత చరిత్రను తమిళనాడు ప్రభుత్వం పాఠ్య పుస్తకాల్లో చేర్చింది.కొందరు ఆదర్శవంతుల జీవితాలకు సంబంధించిన పాఠంలో ప్రపంచంలోని ప్రముఖుల జీవితాలతో పాటు రజినీకాంత్‌ జీవితంను కూడా ఒకటిన్నర పేజీల్లో పొందు పర్చడం జరిగింది.అందులో రజినీకాంత్‌ ఒక కార్పెంటర్‌గా పని చేసి ఆ తర్వాత బస్సు కండక్టర్‌ అయ్యాడు.బస్సు కండక్టర్‌గా వ్యవహరిస్తున్న సమయంలోనే సినిమాల్లో ఆఫర్లు దక్కించుకున్నాడు.

సూపర్‌ స్టార్‌కు అరుదైన గౌరవ�

రజినీకాంత్‌ ఏ పని చేసినా కూడా చాలా కష్టపడి పని చేసే తత్వం.ఆయన ఏం చేసినా అందులో పూర్తిగా ఇన్వాల్వ్‌ అయ్యే చేసే తత్వం.అందుకే రజినీకాంత్‌ ఈ స్థాయికి చేరాడు.ఆయనలా కష్టపడితే ఇప్పుడు కాకున్నా ఒకప్పటికైనా జీవితంలో మంచి ఫలితాలు పొందుతారు అంటూ ఆ పాఠ్యాంశ సారాంశంలో పేర్కొనడం జరిగింది.

మొత్తానికి రజినీకాంత్‌ జీవితంకు సంబంధించిన విషయాలను బుక్‌లో చేర్చడంతో ఆయన అభిమానులు ఉబ్బి తబ్బిబవుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube