సూపర్ స్టార్‌ సినిమాకు బిజినెస్‌ లేదట... కొనేవాళ్లు లేక సొంతంగా రిలీజ్?

తమిళ్ సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా జైలర్ కి బిజినెస్ జరగడం లేదట.తమిళనాడు లో కాదు తెలుగు రాష్ట్రాల్లో జైలర్ సినిమాను కొనుగోలు చేసేందుకు నిర్మాతలు ముందుకు రావడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి.

 Rajinikanth Jailar Movie Telugu Theatrical Rights , Rajinikanth, Jailar Movie, F-TeluguStop.com

సూపర్‌ స్టార్ రజనీ కాంత్ గత చిత్రాలు బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచాయి.కనుక ఈ సినిమా ఫలితం పై ఎవరికి నమ్మకం లేదు.

అందుకే భారీ మొత్తానికి కొనుగోలు చేసేందుకు సిద్ధం గా లేరని తెలుస్తోంది.ఆ కారణం గానే జైలర్ సినిమా ను సొంతం గా తెలుగు రాష్ట్రాల్లో కూడా విడుదల చేయాలని నిర్ణయానికి తమిళ నిర్మాతలు వచ్చారంటూ సమాచారం అందుతుంది.

రజినీకాంత్ హీరో గా నెల్సన్ దిలీప్ దర్శకత్వం లో రూపొందిన ఈ సినిమా కు సంబంధించిన విడుదల తేదీ కన్ఫర్మ్ అయింది.

Telugu Jailar, Rajinikanth, Tamil, Top-Movie

ఈ మధ్య కాలం లో రజనీ కాంత్ భారీ కమర్షియల్ సక్సెస్ లను సొంతం చేసుకోలేక పోతున్నాడు.అందుకే ఈ సినిమా కమర్షియల్ ఎలిమెంట్స్ తో నిండి ఉండాలని దర్శకుడు నెల్సన్ దిలీప్ కాస్త ఎక్కువగానే స్క్రిప్ట్ వర్క్ చేశాడంటూ తమిళ మీడియా కథనాలు రాస్తుంది.భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమా తమిళనాడు భారీ ఎత్తున విడుదలకు సిద్ధమవుతోంది.

ఈజీగా అక్కడ 200 కోట్ల రూపాయల బిజినెస్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఈ సినిమా ను పట్టించుకునే నాధుడు లేకపోవడం విడ్డూరంగా ఉంది.

ఈ సినిమా సక్సెస్ అయితే మళ్లీ రజనీ కాంత్ యొక్క మార్కెట్ పెరిగే అవకాశం ఉంది.ఆయన సినిమా లకు భారీ ఎత్తున బిజినెస్ జరిగే అవకాశాలు ఉన్నాయంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

రజినీకాంత్ సినిమా ఒకప్పుడు తెలుగు రాష్ట్రాల్లో భారీగా వసూళ్లు నమోదు చేసేవి.మళ్లీ ఆ రోజులు వస్తాయా అనేది చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube