అడవిలో తలైవా.. అదరగొట్టిన ప్రోమో!

తమిళ సూపర్ స్టార్ సినిమా వస్తుందంటే ఆ మేనియా ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే.రజినీ సినిమా రిలీజ్‌కు ఉందంటే ఆఫీసులకు సైతం సెలవులు ప్రకటించేంత క్రేజ్ ఉన్న స్టార్ కాబట్టే ఆయన ఇండియన్ సూపర్ స్టార్ అయ్యారు.

 Rajinikanth Into The Wild Promo-TeluguStop.com

ఇక రజినీకి సంబంధించి ఎలాంటి న్యూస్ వచ్చినా ఆడియెన్స్ విడిచిపెట్టే ప్రసక్తే ఉండదు.అలాంటిది ఇప్పుడు బుల్లితెరపై రజీనీకాంత్ కనిపిస్తాడనే వార్తతో తలైవా ఫ్యాన్స్ సంతోషంతో ఊగిపోతున్నారు.

ప్రముఖ టీవీ ఛానల్ డిస్కవరీలో ప్రసారమయ్యే ‘ఇంటూ ది వైల్డ్ విత్ బియర్ గ్రిల్స్’ అనే పాపులర్ షోకు బీభత్సమైన ఫాలోయింగ్ ఉంది.అప్పట్లో ఈ షోలో భారత ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనడంతో ఈ షోకు మరింత ఆదరణ లభించింది.

ఇప్పుడు ఈ షోలో తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ కనిపిస్తాడని తెలిసినప్పటి నుండి ఈ షో ఎప్పుడు ప్రసారమవుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.కాగా తాజాగా ఈ షోకు సంబంధించిన ప్రోమోను నిర్వాహకులు రిలీజ్ చేశారు.

కబాలి స్టయిల్‌లో రజినీ ఎంట్రీతో ఈ ప్రోమో వీడియో అదరగొట్టింది.అడవిలో రజినీకాంత్ చేసే సాహసాలను మనకు ఈ షోలో చూపిస్తారు.

బియర్ గ్రిల్స్‌తో పాటు రజినీ ఈ షో కోసం గతంలో కర్ణాటకలోని బండిపూర్ టైగర్ రిజర్వ్‌లో షూటింగ్ చేసిన సంగతి తెలిసిందే.ఇక ఈ షోకు సంబంధించిన పూర్తి ఎపిసోడ్‌ను మార్చి 23న రాత్రి 8 గంటలకు డిస్కవరీ ఛానల్‌లో ప్రసారం చేయనున్నారు.

ఆ రోజు ఈ షోకు టీఆర్‌పీ రేటింగ్‌తో మోత మోగించేందుకు తలైవా ఫ్యాన్స్ రెడీ అవుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube