స్పీడ్ పెంచిన రజినీకాంత్! మరో ఇద్దరికి గ్రీన్ సిగ్నల్  

ఇద్దరు దర్శకులకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రజినీకాంత్. .

Rajinikanth Gives To Chance Two Directors-rajinikanth Gives To Chance,tollywood,two Directors

  • రజినీకాంత్ వయసు పెరుగుతున్న కొద్ది ఈ జనరేషన్ హీరోలకి ఏ మాత్రం తగ్గకుండా వరుసగా సినిమాలు చేస్తూ తన సత్తా చాటే పయత్నం చేస్తున్నారు. ఇప్పటికే రోబో సీక్వెల్ తర్వాత పేట సినిమాతో ప్రేక్షకులని మెప్పించిన రజిని ప్రస్తుతం మురుగదాస్ దర్శకతంలో దర్బార్ అనే సినిమాకి రెడీ అవుతున్నాడు, ఈ సినిమాలో త్వరలో షూటింగ్ కి వెళ్లనుంది.

  • స్పీడ్ పెంచిన రజినీకాంత్! మరో ఇద్దరికి గ్రీన్ సిగ్నల్-Rajinikanth Gives To Chance Two Directors

  • ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత రజినీకాంత్ రాజకీయాలలో బిజీ అవుతాడని అందరూ భావించారు. అయితే ఊహించని విధంగా మరో ఇద్దరు దర్శకులతో సినిమాలు చేయడానికి రజినీకాంత్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఇప్పుడు కోలీవుడ్ లో సంచలనంగా మారింది.

  • కె ఎస్ రవికుమార్ తో పాటు, యంగ్ డైరెక్టర్ వినోద్ కూడా రజిని అవకాశం ఇచ్చాడని తెలుస్తుంది. మరి ఈ ఇద్దరి దర్శకుల సినిమాలలో ఏది ముందు మొదలెడతాడు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.