రజనీకాంత్ కు బాగా నచ్చిన జూ. ఎన్టీఆర్ సినిమా ఏంటో తెలుసా?

నందమూరి నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి.అద్భుత నటుడిగా ఎదిగాడు జూనియర్ ఎన్టీఆర్.

 Rajinikanth Favorite Movie Of Jr Ntr, Tollywood , Intresting Facts , Rajinikanth-TeluguStop.com

తన తాత పోలికనే కాదు.ఆయన నటను కూడా పునికిపుచ్చుకున్నాడు జూ.ఎన్టీఆర్.నటన, డ్యాన్స్, ఫైట్స్ ఏ విషమంలోనూ తాతకు తగ్గకుండా దూసుకుపోతున్నాడు.

టాలీవుడ్ లో తిరుగులేని హీరోగా పేరు సంపాదించాడు .వరుసగా 5 హిట్లు కొట్టి మంచి జోరుమీద కొనసాగుతున్నాడు.ప్రస్తుతం జూ.ఎన్టీఆర్ కు తెలుగులోనే కాదు.

తమిళ, కన్నడ, మలయాళం చిత్ర పరిశ్రమల్లోనే మంచి ఆదరణ ఉంది.ఆయన నటనను, డ్యాన్సులను జనాలు ఎంతో మంది ఇష్టపడుతుంటారు.సెలబ్రిటీలు కూడా ఆయన సిమాల పట్ల ఆసక్తి కనబరుస్తారు.సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ కు కూడా జూ.ఎన్టీఆర్ కు చెందిన ఓ సినిమా ఎంతో బాగా నచ్చిందట.ఇంతకీ ఆ సినిమా ఏంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

Telugu Arvinda Samatha, Favorite, Harikrishna, Jr Ntr, Kollywood, Pooja Hegdhe,

వాస్తవాన్ని చెప్పుకోవాలంటే సూపర్ స్టార్ రజనీకాంత్ జూ.ఎన్టీఆర్ సినిమాలకు అభిమాని అట.ఆయన నటించిన పలు సినిమాలను చూస్తుంటాడట.ఇదే నేపథ్యంలో తాజాగా విడుదల అయిన ఎన్టీఆర్, త్రివిక్రమ్ మూవీ అరవింద సమేత సినిమా .బ్లాక్ బస్టర్ కొట్టింది.ఈ సినిమాను రజనీకాంత్ చూశాడట.

తనకు ఈ సినిమా ఎంతో నచ్చిందట.జూనియర్ ఎన్టీఆర్ పై ఆయన ప్రశంసల జల్లు కురిపించాడు.

ఈ సినిమా చూశాక తనకు తొలిసారి కొడుకులు ఎందుకు లేరా? అని బాధపడుతున్నట్లు చెప్పాడు.

Telugu Arvinda Samatha, Favorite, Harikrishna, Jr Ntr, Kollywood, Pooja Hegdhe,

అరవింద సమేత సినిమా అనంతరం తనకూ ఓ కొడుకు ఉంటే బాగుండు అనిపించిందట.ఆ భావన కలిగేలా త్రివిక్రమ్, ఎన్టీఆర్ సినిమా చేశారని వెల్లడించాడు రజనీ.నిజానికి ఎన్టీఆర్ ఫ్యామిలీతో రజనీకి ముందు నుంచే మంచి సంబంధం ఉంది.

హరిక్రిష్ణ, రజనీకాంత్ ఎంతో ఫ్రెండ్లీగా ఉండేవారు.హరిక్రిష్ణ చనిపోయినప్పుడు రజనీ జపాన్ లో ఉన్నాడు.

అందుకే తను రాలేకపోయాడు.ఇక రజనీ తాజాగా నటించిన పెద్దన్న సినిమా దీపావళి కానుకగా విడుదల అయ్యింది.

జూ.ఎన్టీఆర్ నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube