పిచెక్కి పోతున్న రజినీకాంత్‌ ఫ్యాన్స్‌... మళ్లీ రికార్డులు బ్రేక్‌ ఖాయం  

Rajinikanth Fans Going Mad-

సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ గత అయిదు ఆరు సంవత్సరాలుగా ఆశించిన స్థాయిలో సత్తా, ప్రభావం చూపించడం లేదని చెప్పడంలో సందేహం లేదు. ఇతర తమిళ హీరోలు విజయ్‌, అజిత్‌ల రేంజ్‌లో రజినీకాంత్‌ సినిమాలు వసూళ్ల పరంగా తమిళనాట అంతగా ఆశాజనకంగా లేవు. దాంతో రజినీకాంత్‌ ఫ్యాన్స్‌ కాస్త నిరాశలో ఉన్నారు..

పిచెక్కి పోతున్న రజినీకాంత్‌ ఫ్యాన్స్‌... మళ్లీ రికార్డులు బ్రేక్‌ ఖాయం-Rajinikanth Fans Going Mad

పేటతో కాస్త తేరుకున్న రజినీకాంత్‌ తదుపరి చిత్రంతో మునుపటి సూపర్‌ స్టార్‌ స్టార్‌డంను చూపించడం ఖాయం అంటూ సినీ వర్గాల వారు చెబుతున్నారు.

రజినీకాంత్‌ తదుపరి చిత్రంను మురుగదాస్‌ చేస్తున్నాడు. తమిళంలోనే కాకుండా ఇండియాలోనే టాప్‌ డైరెక్టర్స్‌లో ఒకరు అయిన మురుగదాస్‌ ప్రస్తుతం తమిళ సినీ పరిశ్రమలో టాప్‌ డైరెక్టర్‌గా చెప్పుకోవచ్చు.

ఎన్నో వందల కోట్ల సినిమాలను ప్రేక్షకులకు అందించిన మురుగదాస్‌ ఇప్పుడు రజినీకాంత్‌తో సినిమాను చేసేందుకు సిద్దం అయ్యాడు. రజినీకాంత్‌తో సినిమాకు ‘దర్బార్‌’ అనే టైటిల్‌ను ఖరారు చేశాడు.

రజినీకాంత్‌ను దాదాపు రెండు దశాబ్దాల తర్వాత పోలీస్‌ ఆఫీసర్‌గా చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. పూర్తిగా పోలీస్‌ స్టోరీతో ఈ చిత్రం రూపొందుతోంది. భారీ ఎత్తున అంచనాలున్న దర్బార్‌ చిత్రం త్వరలో రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం అయ్యి, ఇదే సంవత్సరం దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయి.

రజినీకాంత్‌కు జోడీగా ఒక హీరోయిన్‌గా నయనతార మరో హీరోయిన్‌గా కీర్తి సురేష్‌ నటించే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. అయితే హీరోయిన్స్‌ విషయంలో మురుగదాస్‌ ఇంకా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. మురుగదాస్‌ డైరెక్షన్‌లో రజినీకాంత్‌ సినిమా కోసం తెలుగు మరియు తమిళ ఆడియన్స్‌ ఎదురు చూస్తున్నారు..

ఈ సినిమా రికార్డుల మ్రోత మోగించడం ఖాయంగా ట్రేడ్‌ వర్గాల వారు అంటున్నారు. లైకా ప్రొడక్షన్స్‌ వారు ఈ చిత్రాన్ని దాదాపు 150 కోట్ల బడ్జెట్‌తో నిర్మించేందుకు ముందుకు వచ్చారు.