రజినీకాంత్ ఇంటి ముందు నిప్పు అంటించుకున్న అభిమాని!

సూపర్ స్టార్ రజినీకాంత్ అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.అయన అభిమానుల సంఖ్యను.

 Super Star Rajinikanth, Fan Attempts Suicide, Rajinikanth House , Chennai, Rajin-TeluguStop.com

అయన అభిమానుల ప్రేమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.అలాంటి రజినీకాంత్ 70 ఏళ్ళ వయసు వచ్చిన అభిమానుల కోసం నిత్యం సినిమాల్లో కనిపిస్తూనే ఉంటున్నారు.

ఇక ఈ నేపథ్యంలోనే అయన 2017లో రాజకీయాల్లోకి అడుగు పెట్టనున్నట్టు ప్రకటించారు.ఇక జనవరి 1వ తేదీ 2021 న అయన రాజకీయ పార్టీ గురించి ప్రకటిస్తా అని చెప్పగా.

రోజులు ఉందనగా అయన ఆస్పత్రి పాలయ్యారు.

అయన ఆస్పత్రిలో ఉన్న సమయంలో రాజకీయ పార్టీ ప్రకటించకూడదు.

రాజకీయాల్లోకి దిగకూడదు అనే ఉద్దేశ్యంతోనే అయన ఆస్పత్రి పాలయ్యాడని కొందరు సినీ రాజకీయ విశ్లేషకులు ప్రచారం చెయ్యగా.చివరికి అదే నిజం అయ్యింది.

అనారోగ్యం కారణం అయన రాజకీయాల్లోకి రావట్లేదని ప్రకటించాడు.దీంతో తీవ్ర నిరాశకు గురైన అభిమానుల్లో ఒకరు రజినీకాంత్ రాజకీయాల్లోకి ప్రవేశించకూడదనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అభిమాని మురుకేసన్ తనను తాను నిప్పంటించుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు.

Telugu Chennai, Fan Attempts, Rajinikanth-Movie

తీవ్ర గాయాలు కావడంతో అతడిని ఆస్పత్రికి తరలించారు.రజినీకాంత్ రాజకీయాల్లో రావాలని రజినీకాంత్ నివాసం ఎదుట అభిమానులు గత మూడు రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్నారు.తమిళనాడులోని వివిధ ప్రాంతాల్లో రజినీకాంత్ అభిమానులు అతని నివాసం వద్దకు వచ్చాడు.కొన్ని చోట్లా రజినీకాంత్ అభిమానులు రాజకీయాల్లోకి రావడం లేదనే కోపంతో రజినికాంత్ దిష్టి బొమ్మలను సైతం తగలబెడుతున్నారు.

ప్రస్తుతం ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయ్.ఆరోగ్య సమస్యల కారణంగానే రజినీకాంత్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube