సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లుగా..!  

Rajinikanth Donates Rs 15 Lakh To Kerala Cm\'s Relief Fund For Flood Victims-

కేరళలో వరుణ దేవుడు ఉగ్ర రూపం దాల్చాడు.కేరళలోని సగభాగం నీట మునిగి పోయింది.కేరళ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు..

Rajinikanth Donates Rs 15 Lakh To Kerala Cm\'s Relief Fund For Flood Victims--Rajinikanth Donates Rs 15 Lakh To Kerala CM's Relief Fund For Flood Victims-

100 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా ఇంత భారీ వర్షాలు కేరళలో నమోదు కాలేదు.ఇంతటి ప్రళయాన్ని కేరళ ఎప్పుడు కూడా చూసింది లేదు.సునామి సమయంలో కూడా ఇంతటి దారుణ పరిస్థితిని కేరళ ఎదుర్కోలేదు.ఇంతటి దారుణమైన పరిస్థితుల్లో ఉన్న కేరళను ఆదుకునేందుకు దేశం నలుమూలల నుండే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులు మరియు ఇతర దేశాల వారు కూడా తమకు తోచిన సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు.

సినీ ప్రముఖులు కూడా కేరళకు సాయంగా నిలిచేందుకు ముందుకు వస్తున్నారు.హీరోలు, హీరోయిన్స్‌, కమెడియన్స్‌, డైరెక్టర్స్‌ ఇలా అంతా కూడా తమకు తోచిన సాయంను ప్రకటిస్తున్నారు.తమ అభిమానులను కూడా సాయం చేసేందుకు ముందుకు రావాల్సిందిగా హీరోలు కోరుతున్నారు.

స్టార్‌ హీరోలు పలువురు 25 లక్షల నుండి ఆపైనే సాయంను ప్రకటించారు.తెలుగు స్టార్‌ హీరోలు చాలా మంది 25 లక్షల సాయంను ప్రకటించారు.అయితే తమిళ సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ చేసిన సాయంపై మాత్రం విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నాయి.

కేరళకు తమిళ స్టార్స్‌ పలువురు తమ వంతుగా సాయం అందించారు.అందులో భాగంగానే రజినీకాంత్‌ 15 లక్షలను తన ఆర్థిక సాయంగా ప్రకటించాడు.ఈమద్య హీరోయిన్‌గా పరిచయం అయిన సాయ పల్లవి ఏకంగా 35 లక్షలను ప్రకటించింది.అలాంటిది హీరో రజినీకాంత్‌ 15 లక్షలను సాయంగా ప్రకటించడంపై విమర్శలు వస్తున్నాయి.సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ నటించిన ఎన్నో చిత్రాలు కేరళలో ప్రదర్శితం అయ్యి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి.అక్కడ రజినీకాంత్‌కు భారీ ఎత్తున ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది.

తనను ఆధరించిన కేరళకు రజినీకాంత్‌ సాయంగా నివాల్సిన అవసరం ఎంతైనా ఉంది.ఇలాంటి సమయంలో కేరళకు కనీసం 50 లక్షల నుండి కోటి రూపాయల వరకు ఆర్థిక సాయంను రజినీకాంత్‌ చేస్తే బాగుండేది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.కేరళలో జనజీవనం అస్థవ్యస్థం అయ్యింది, సంవత్సరం పాటు కేరళ జనాలు కోలుకోవడం దాదాపు అసాధ్యం.ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా తమ స్థాయిని మించి సాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది..

కాని రజినీకాంత్‌ మాత్రం పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లుగా సూపర్‌ స్టార్‌ రేంజ్‌లో సాయంను ప్రకటించలేదు.