లాక్‌డౌన్‌లో తలైవా ఏం చేస్తున్నాడో తెలుసా?  

Rajinikanth Doing This In Lockdown - Telugu Annaththie, Farmhouse, Lockdown, Rajinikanth

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన రీసెంట్ మూవీ దర్బార్ సంక్రాంతి బరిలో రిలీజ్ అయ్యి అన్ని భాషల్లోనూ అదిరిపోయే రిజల్ట్‌ను దక్కించుకుంది.ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ డైరెక్ట్ చేయడంతో ఈ సినిమాను చూసేందుకు జనం థియేటర్లకు ఎగబడ్డారు.

 Rajinikanth Doing This In Lockdown

ఇక ప్రస్తుతం తన నెక్ట్స్ చిత్రాన్ని మాస్ చిత్రాల దర్శకుడు శివ డైరెక్షన్‌లో తెరకెక్కిస్తున్న రజినీ, ప్రస్తుతం లాక్‌డౌన్ కారణంగా తన ఇంటికే పరిమితం అయ్యాడు.

కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో షూటింగ్‌లు వాయిదా పడ్డ సంగతి తెలిసిందే.

లాక్‌డౌన్‌లో తలైవా ఏం చేస్తున్నాడో తెలుసా-Gossips-Telugu Tollywood Photo Image

దీంతో రజినీకాంత్ దాదాపు మూడు నెలలుగా ఇంటికే పరిమితం అయ్యాడు.అయితే తన కుటుంబ సభ్యులతో కలిసి తన ఫాంహౌజ్‌లోనే ఉంటున్నాడు.

అక్కడి బయటి వ్యక్తులను ఎవరినీ కూడా రానివ్వడం లేదట.తన పొలంలో పండిన కూరగాయలు మాత్రమే తింటూ తన కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని కాపాడుతున్నాడు.

ఇక ఎక్కువగా ఖాళీ సమయం దొరకడంతో ఓటీటీలో సినిమాలు, వెబ్ సిరీస్‌లు చూస్తూ సమయం గడుపుతున్నారు.

మొత్తానికి రజినీకాంత్ లాంటి బిజీ స్టార్‌ను సైతం ఇంటికే పరిమితం చేసిన కరోనా వైరస్, తమిళ స్టార్స్‌ను భయబ్రాంతులకు గురిచేస్తోంది.

తమిళనాట అధికసంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతుండటంతో ఇప్పట్లో సినిమా షూటింగ్‌లు మొదలుపెట్టే ఆలోచనలో లేరట అక్కడి దర్శకనిర్మాతలు.ఇక రజినీ ప్రస్తుతం నటిస్తున్న అన్నాతే చిత్రం పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Rajinikanth Doing This In Lockdown Related Telugu News,Photos/Pics,Images..

footer-test