చంద్రముఖి సీక్వెల్ వార్తలపై క్లారిటీ ఇచ్చిన లారెన్స్  

Raghava Lawrence clarifies on Chandramukhi two, Rajinikanth, Director P Vasu, Kollywood, Tollywood - Telugu Director P Vasu, Kollywood, Raghava Lawrence Clarifies On Chandramukhi Two, Rajinikanth, Tollywood

డాన్స్ మాస్టర్, కొరియోగ్రాఫర్ గా కెరియర్ స్టార్ట్ చేసి నటుడుగా సక్సెస్ అయ్యి దర్శకుడు అవతారం ఎత్తి సౌత్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకున్న వ్యక్తి రాఘవ లారెన్స్.క్రింది నుంచి తన కష్టంతో పైకి ఎదిగిన లారెన్స్ ప్రస్తుతం హిందీలో కాంచన మూవీని అక్షయ్ కుమార్ తో లక్ష్మి బాంబ్ గా రీమేక్ చేశాడు.

 Rajinikanth Director P Vasu Raghava Lawrence

ఇక హర్రర్ చిత్రాలకి కేరాఫ్ అడ్రెస్ గా మారిపోయిన లారెన్స్ ప్రస్తుతం చంద్రముఖి సీక్వెల్ లో రజినీకాంత్ పోషించిన పాత్రలో కనిపించబోతున్నాడు.పి వాసు దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్ళబోతుంది.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో ముఖ్యపాత్ర కోసం జ్యోతిక, సిమ్రాన్, కియరా అద్వానీల పేర్లు గత కొంత కాలంగా వినిపిస్తున్నాయి.అయితే తాజాగా ఈ సినిమా క్యాస్టింగ్ పై లారెన్స్ స్వయంగా వివరణ ఇచ్చాడు.

చంద్రముఖి సీక్వెల్ వార్తలపై క్లారిటీ ఇచ్చిన లారెన్స్-Movie-Telugu Tollywood Photo Image

చంద్రముఖిలో ఫిమేల్ లీడ్ రోల్ కు సంబంధించి అనేక రూమర్లు వస్తున్నాయని, జ్యోతిక, సిమ్రాన్, కియరాల్లో ఒకరు చేస్తారని ప్రచారం జరుగుతోందని, అయితే ఇదంతా ఫేక్ న్యూస్ అని కొట్టిపారేశాడు.ప్రస్తుతం చంద్రముఖి-2 స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని, కరోనా పరిస్థితులు సద్దుమణిగాక ప్రధానపాత్రలో నటించే కథానాయిక ఎవరన్నది తేలుతుందని స్పష్టం చేశాడు.

త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తామని లారెన్స్ సోషల్ మీడియాలో తెలిపాడు.ఇక లారెన్స్ ఇచ్చిన క్లారిటీతో చంద్రముఖి సీక్వెల్ లో లీడ్ రోల్ కోసం ఇంకా ఎవరిని అనుకోలేదని అర్ధమవుతుంది.

అయితే పి వాసు దర్శకత్వంలో గతంలో తెలుగులో చంద్రముఖి సీక్వెల్ అంటూ వెంకటేష్ తో నాగవల్లి అనే సినిమా చేశాడు.అది కాస్తా డిజాస్టర్ అయ్యింది.మరి ఈ సారి లారెన్స్ కోసం ఎలాంటి కథ సిద్ధం చేశాడు అనేది వేచి చూడాలి.

#Rajinikanth #Director P Vasu #Kollywood

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Rajinikanth Director P Vasu Raghava Lawrence Related Telugu News,Photos/Pics,Images..