రజినీకాంత్ గురించి షాకింగ్ విషయం చెప్పిన కూతురు సౌందర్య?

Rajinikanth Daughter Soundarya Vishagan Start Voice Based App Hoote

సినిమా ఇండస్ట్రీలో రజనీకాంత్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఎన్నో అద్భుతమైన సినిమాల స్టార్ హీరోగా గుర్తింపు సంపాదించుకున్న రజనీకాంత్ కూతురు ఐశ్వర్య, సౌందర్య గురించి అందరికీ సుపరిచితమే.

 Rajinikanth Daughter Soundarya Vishagan Start Voice Based App Hoote-TeluguStop.com

సౌందర్య రజనీకాంత్ దర్శకురాలిగా ఎంతో మంచి పేరు సంపాదించుకుంది.ఈ క్రమంలోనే రజనీకాంత్ గురించి సౌందర్య పలు షాకింగ్ విషయాలను తెలియజేసింది.

ఈ సందర్భంగా సౌందర్య మాట్లాడుతూ తన తండ్రి తమిళం ఎంతో అనర్గళంగా మాట్లాడగలడు కానీ స్పష్టంగా రాయలేడని ఈ సందర్భంగా తెలియజేశారు.

 Rajinikanth Daughter Soundarya Vishagan Start Voice Based App Hoote-రజినీకాంత్ గురించి షాకింగ్ విషయం చెప్పిన కూతురు సౌందర్య-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ క్రమంలోనే ఒకరోజు రజనీకాంత్ తనకు టైపింగ్ కాకుండా వాయిస్ మెసేజ్ చేశారని ఇలా తన తండ్రి వాయిస్ మెసేజ్ చేయడంతో తనకు ఒక అద్భుతమైన ఆలోచన వచ్చిందని ఆ ఆలోచన నుంచి పుట్టినదే హూట్‌ అనే సామాజిక మాధ్యమం అని సౌందర్య తెలియజేశారు.

ఈ క్రమంలోనే సోమవారం ఈమె హూట్‌ అనే సామాజిక మాధ్యమాన్ని ప్రారంభించడంతో దీనిని రజినీకాంత్ ఆన్లైన్ ద్వారా ప్రారంభించారు.

Telugu Kollywood, Rajinikanth, Shocking News, Soundarya Rajinikanth, Tamil Language, Tollywood-Movie

ఈ సందర్భంగా సౌందర్య రజనీకాంత్ మాట్లాడుతూ.ఇది ఫేస్ బుక్, ట్విట్టర్ మాదిరిగానే అద్భుతమైన సేవలను అందిస్తుందని, దీనిద్వారా 15 జాతీయ భాషలు, పది అంతర్జాతీయ భాషలలో వాయిస్ హూట్‌ ఉపయోగించుకోవచ్చని ఈ సందర్భంగా ఈమె తెలిపారు.అయితే తన తండ్రికి తమిళం రాయడం రాదని చెప్పడంతో ఆయన పట్ల ఉన్న అభిమానం ఏ ఒక్కరికి తగ్గదని ఈమె ఆశాభావం వ్యక్తం చేశారు.

#Tamil Language #Kollywood #Rajinikanth

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube