రెండో పెళ్లి చేసుకోబోతున్న 'రజినీకాంత్ కుమార్తె సౌందర్య'.! ఎవరినో తెలుసా.? మాజీ భర్త ఏమయ్యారు.?     2018-11-14   10:16:27  IST  Sainath G

రజనీకాంత్ చిన్న కుమార్తె సౌందర్య త్వరలో రెండో పెళ్లి చేసుకోనున్నారు. గతేడాది మాజీ భర్త అశ్విన్ రామ్‌కుమార్‌కు విడాకులిచ్చిన సౌందర్య.. నటుడు, వాణిజ్యవేత్త విశ్వగణ్ వనంగమూడిని పెళ్లి చేసుకోనుంది. సౌందర్య ఐదేళ్ల కుమారుడు వేద్ కృష్ణ ప్రస్తుతం ఆమెతోనే ఉంటున్నాడు. కాబోయే భర్త విశ్వగణ్‌ను కూడా ఇది రెండో వివాహమే.

Rajinikanth Daughter Soundarya Set To Get Married Again In January-Soundarya Second Marriage Vishagan Vanangamud

సౌంద‌ర్య 2010లో పారిశ్రామికవేత్త అశ్విన్ కుమార్‌ని వివాహం చేసుకున్న విష‌యం తెలిసిందే. కొన్నాళ్ళ త‌ర్వాత‌ వారి ఇద్దరి మధ్యా అభిప్రాయభేదాలు తలెత్తాయి. సర్దుకుపోవడానికి ప్రయత్నించారు. కానీ కుదరలేదు. చివరికి ఆ ఇద్దరూ విడిపోయేందుకే నిర్ణయించుకున్నారు. 2017లో ఈ జంట విడాకులు తీసుకున్నారు.

Rajinikanth Daughter Soundarya Set To Get Married Again In January-Soundarya Second Marriage Vishagan Vanangamud

అశ్విన్‌తో విడిపోయిన త‌ర్వాత త‌ను సినిమాల‌తో బిజీగా ఉంది సౌంద‌ర్య‌. బావ ధ‌నుష్‌తో ఆ మ‌ధ్య “విఐపి 2” సినిమా కూడా చేసింది. అయితే ఇప్పుడు ఈమె మ‌ళ్లీ పెళ్లి చేసుకోవాల‌ని నిర్ణ‌యించుకుంది.ప్ర‌ముఖ బిజినెస్ మ్యాన్ విషాగన్ వనంగముడితో సౌంద‌ర్య ప్రేమలో ప‌డింద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. అంతేకాదు.. చాలా సైలెంట్‌గా ఈ మ‌ధ్యే విషాగన్‌, సౌందర్య రజనీకాంత్ నిశ్చితార్థం కూడా జ‌రిగింద‌ని.. దానికి చాలా త‌క్కువ మంది స‌న్నిహితులు.. కుటుంబ సభ్యులు మాత్రమే హాజరైనట్టు తెలుస్తుంది.

Rajinikanth Daughter Soundarya Set To Get Married Again In January-Soundarya Second Marriage Vishagan Vanangamud

విశ్వగణ్ ‘వంజగర్ ఉల్గామ్’ అనే సినిమాతో తమిళ తెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత పలు సినిమాల్లో సహ నటుడిగా పనిచేశారు. సినిమాలతో పాటు ఆయన ఫార్మాసూటికల్ సంస్థను నిర్వహిస్తున్నారు.సౌందర్య 2019, జనవరి నెలలో విశ్వగణ్‌ను పెళ్లి చేసుకోనున్నారు.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.