దర్బార్ ట్రైలర్.. బ్యాడ్ కాప్‌గా రెచ్చిపోయిన రజినీ

సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం ‘దర్బార్’ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.తలైవా చిత్రం అంటేనే ఆ క్రేజ్ ఏ రేంజ్‌లో ఉంటుందో అందరికీ తెలిసిందే.

 Rajinikanth Darbar Trailer-TeluguStop.com

ఇప్పుడు తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.

దర్బార్ సినిమాలో రజినీకాంత్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తోన్నాడు.

ముంబై నగరంలో మాఫియా గ్యాంగ్‌లకు చుక్కలు చూపించే ఆఫీసర్ పాత్రలో రజినీకాంత్ తనదైన స్టైల్‌ను చూపించారు.ఈ ట్రైలర్‌లో రజినీ డైలాగులు ఎప్పటిలాగే ఫ్యాన్స్‌తో విజిల్స్ వేయించాయి.

ఇక పంచ్ డైలాగులకు రజినీ ఫ్యాన్స్ మరోసారి సిద్ధంగా ఉండొచ్చని చిత్ర యూనిట్ ఈ ట్రైలర్ ద్వారా తెలిపారు.

నయనతార హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి విలన్ పాత్రలో నటిస్తున్నాడు.

అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.తెలుగు ఆడియెన్స్‌కు షాకిస్తూ ఈ సినిమాను సంక్రాంతి బరిలో రజినీ వదులుతున్నాడు.

దీంతో మహేష్, బన్నీ ఫ్యాన్స్ డైలమాలో పడ్డారు.మరి ఈ చిత్ర రిలీజ్ డేట్‌లో ఏదైనా మార్పు ఉంటుందా లేక మన తెలుగు హీరోలే వారి సినిమాల రిలీజ్ డేట్‌లను మార్చుకుంటారా అనేది చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube