క్లిక్ అయిన సూపర్ స్టార్ ఇంక ఆ హీరోలకు చుక్కలే...

ప్రస్తుతం సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన టువంటి చిత్రం దర్బార్.ఈ చిత్రానికి ప్రముఖ తమిళ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించాడు.

 Rajinikanth Darbar Movie Latest Update-TeluguStop.com

ఈ చిత్రంలో రజనీకాంత్ సరసన కోలీవుడ్ క్వీన్ నయనతార నటించగా సునీల్ శెట్టి, నివేద థామస్, ప్రతీక్ బబ్బర్ తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు.అయితే ఈ చిత్రం  ఈరోజున ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ప్రపంచవ్యాప్తంగా రెండు షోలను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ చిత్రం థియేటర్లలో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.

మామూలుగా సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా అంటే అభిమానులు తమ పనులన్నీ మానుకుని సినిమాకి వెళుతుంటారు.

అయితే ఇప్పటి వరకు ఈ చిత్రాన్ని చూసినటువంటి రజినీకాంత్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.అంతేకాక ఇప్పటికే మంచి పాజిటివ్ టాక్ ఈ చిత్రం తెచ్చుకుంది.దీంతో టాలీవుడ్ లో మరో సారి తన సత్తా ఏంటో సూపర్ స్టార్ రజినీకాంత్ నిరూపించుకున్నాడు. అంతేగాక సంక్రాంతి బరిలో తెలుగు హీరోలకి తానేమి తీసిపొనంటూ దర్బార్ చిత్రం ద్వారా సవాల్ విసురుతున్నాడు రజనీకాంత్.

Telugu Allu Arjun, Darbar, Darbar Latest, Latest Darbar, Maheshbabu, Rajinikanth

అయితే ఇది ఇలా ఉండగా టాలీవుడ్ ప్రిన్స్ మరియు సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన టువంటి సరిలేరు నీకెవ్వరు చిత్రం, అలాగే స్టైలిష్ స్టార్ బన్నీ నటించినటువంటి అల వైకుంఠపురంలో చిత్రాలు కూడా సంక్రాంతి బరి లోకి దిగుతున్నాయి.ముందుగా సంక్రాంతి బరిలో దిగినటువంటి రజనీకాంత్ తన సత్తా ఏంటో ఇప్పటికే నిరూపించుకున్నాడు.ఇక మిగిలింది మహేష్ బాబు మరియు అల్లు అర్జున్ ల వంతు.దీంతో అభిమానులు సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురంలో చిత్రాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అయితే ఈ సంక్రాంతి బరిలో ఎవరు గెలిచారనే విషయం తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే…

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube