200 కోట్ల క్లబ్‌లో దర్బార్.. రజినీయా మజాకా!  

Rajinikanth Darbar Enters 200 Crore Club-darbar,nayanthara,rajinikanth

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన లేటెస్ట్ మూవీ దర్బార్ భారీ అంచనాల నడుమ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.ఈ సినిమాకు మిక్సిడ్ టాక్ రావడంతో ఈ సినిమా కలెక్షన్లు ఎంతమేర సాధిస్తాయా అని అందరూ అనుకున్నారు.

Rajinikanth Darbar Enters 200 Crore Club-darbar,nayanthara,rajinikanth Telugu Tollywood Movie Cinema Film Latest News Rajinikanth Darbar Enters 200 Crore Club-darbar Nayanthara Rajinikanth-Rajinikanth Darbar Enters 200 Crore Club-Darbar Nayanthara

కానీ ఎవ్వరూ ఊహించని విధంగా దర్బార్ కలెక్షన్లు రావడంతో అందరూ అవాక్కవుతున్నారు.

స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ తెరకెక్కించిన దర్బార్ చిత్రం పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా మాస్ ఆడియెన్స్‌ను ఇంప్రెస్ చేసింది.

ఈ సినిమాలో రజినీ యాక్టింగ్‌కు జనాలు ఫిదా అయ్యారు.ఇక ఈ సినిమా కలెక్షన్ల పరంగా ఏకంగా రూ.200 కోట్ల క్లబ్‌లో చేరినట్లు చిత్ర వర్గాలు తెలిపాయి.ఈ ఫీట్‌ను అందుకోవడం రజినీకి ఇది ఐదవసారి కావడం విశేషం.గతంలో రోబో, కబాలి, 2.0, పేట సినిమాలు ఈ ఫీట్‌ను అందుకున్నాయి.

రజినీ ఫాలోయింగ్‌ ఎలాంటిదో ఈ సినిమా మరోసారి ప్రూవ్ చేసింది.ఇక నయనతార హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా తమిళ, తెలుగు భాషల్లో బాగానే ఆడుతున్నా హిందీలో మాత్రం బిచానా ఎత్తేసింది.

ఈ సినిమాకు ఇంతటి కలెక్షన్లు వస్తాయని మాత్రం ఎవ్వరూ ఊహించలేదు.

తాజా వార్తలు