దర్బార్ 8 రోజుల కలెక్షన్లు.. సత్తా చాటిన రజినీ  

rajinikanth darbar 8 days collections - Telugu Ar Murugadoss, Collections, Darbar, Nayanthara, Rajinikanth

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన లేటెస్ట్ మూవీ దర్బార్ సంక్రాంతి బరిలో అందరికంటే ముందు దిగిన సినిమా.ఈ చిత్రాన్ని జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ రిలీజ్ చేశారు చిత్ర యూనిట్.

TeluguStop.com - Rajinikanth Darbar 8 Days Collections

ఈ సినిమాలో రజినీ మరోసారి పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తుండటంతో ఈ సినిమాపై అన్ని వర్గాల ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ డైరెక్ట్ చేయడంతో ఆ అంచనాలు రెట్టింపు అయ్యాయి.

ఇక తమిళంతో పాటు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉన్న రజినీ, దర్బార్ సినిమాతో తన సత్తా చాటాడ.సంక్రాంతి బరిలో మరో రెండు స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అయినప్పటికీ రజినీ తనదైన ముద్ర వేశాడు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం 8 రోజుల్లో రూ.9.30 కోట్ల షేర్ కలెక్షన్లు రాబట్టింది.రెండు పెద్ద సినిమాలు ఉన్నా ఆ పోటీలో రజినీ సినిమా ఏమాత్రం భయపడకుండా గట్టిపోటీని ఇస్తూ వచ్చింది.

ఇక ఏరియాల వారీగా ఈ సినిమా 8 రోజుల కలెక్షన్లు ఈ విధంగా ఉన్నాయి.

నైజాం – 4.69 కోట్లు

సీడెడ్ – 1.03 కోట్లు

నెల్లూరు – 0.37 కోట్లు

కృష్ణా – 0.51 కోట్లు

గుంటూరు – 0.67 కోట్లు

వైజాగ్ – 1.00 కోట్లు

ఈస్ట్ – 0.61 కోట్లు

వెస్ట్ – 0.42 కోట్లు

టోటల్ ఏపీ+తెలంగాణ – రూ.9.30 కోట్లు

#AR Murugadoss #Nayanthara #Rajinikanth #Collections #Darbar

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు