నాకే సీఎం పదవిపై ఆసక్తి లేదు, బాగా చదువుకున్న వాడే సీఎం అవ్వాలి  

Rajinikanth Comments On Cm Chair In Tamilandu Telugustop - Telugu Rajinikanth, Rajinikanth Latest Update, Rajinikanth On Press Meet, Rajinikanth Political Entry, Tamilanadu Super Star

రెండు సంవత్సరాల క్రితం రాజకీయాల్లోకి రాబోతున్నట్లుగా ప్రకటించిన రజినీకాంత్‌ మరో అడుగు ముందుకు వేశారు.నిన్న మొన్నటి నుండి వస్తున్న వార్తలకు ఫుల్‌ స్టాప్‌ పెట్టారు.

 Rajinikanth Comments On Cm Chair In Tamilandu Telugustop

రజినీకాంత్‌ నేడు మీడియాతో మాట్లాడుతూ మరోసారి ఈ విషయమై క్లారిటీ ఇచ్చాడు.తన రాజకీయ పార్టీ పేరు ఏంటీ, ఎప్పుడు ప్రారంభించబోతున్నట్లుగా అయితే రజినీకాంత్‌ ప్రకటించలేదు.

కాని రజినీకాంత్‌ తన రాజకీయ పార్టీ ఎలా ఉండబోతుంది అనే విషయంపై ప్రకటన చేశాడు.

నాకే సీఎం పదవిపై ఆసక్తి లేదు, బాగా చదువుకున్న వాడే సీఎం అవ్వాలి-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

తనకు ముఖ్యమంత్రి అవ్వాలనే ఆలోచన లేదు అంటూ చెప్పిన రజినీకాంత్‌ విద్యావంతుడినే సీఎంగా చేయాలని తాను భావిస్తున్నట్లుగా చెప్పుకొచ్చాడు.యువతకు అవకాశాలు కల్పిస్తూ కొత్త వారిని రాజకీయాల్లోకి తీసుకు వచ్చే ఉద్దేశ్యంతో తాను పార్టీ పెట్టబోతున్నట్లుగా చెప్పాడు.అలాగే ఐఏఎస్‌ ఐపీఎస్‌ లను కూడా పార్టీలోకి తీసుకు వచ్చే ఉద్దేశ్యంలో ఉన్నట్లుగా చెప్పుకొచ్చాడు.

ఉద్యోగ విరమణ చేసిన సీనియర్స్‌ను కూడా రంగంలోకి దించాలని భావిస్తున్నట్లుగా చెప్పుకొచ్చాడు.కొత్త రాజకీయాలు చేయాలని అనుకుంటున్నాను.అందుకోసం తాను కేవలం పార్టీ అధ్యక్షుడిగా మాత్రమే ఉంటాను.సీఎం పదవిపై తనకు ఆశ లేదు.

సీఎం పదవిని ఖచ్చితంగా ఒక మంచి విద్యావంతుడికి మరియు ప్రజ్ఞాశీలికి సమాజ సేవపై ఆసక్తి ఉన్న వారికి ఇస్తానంటూ చెప్పుకొచ్చాడు.ఇన్ని చెప్పిన రజినీకాంత్‌ పార్టీ పేరు మాత్రం చెప్పలేదు.

అది ఎప్పుడు ప్రకటిస్తాడో చూడాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Rajinikanth Latest Update,rajinikanth On Press Meet,rajinikanth Political Entry,tamilanadu Super Star- Related....