దోస్తీ అంటే ఇదే మరి.. అత్యున్నత పురస్కారం ఫ్రెండ్‌‌కు అంకితమిచ్చిన రజనీ‌కాంత్.. 

తమిళ్ తలైవా, సూపర్ స్టార్ రజనీకాంత్ ఇటీవల ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు చేతుల మీదుగా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే.

 Rajinikanth Award Given To His Close Friend Raj Bahadoor Details, Rajnikanth, T-TeluguStop.com

ఈ క్రమంలోనే తనకు అవార్డు అందించిన అతిథులకు థాంక్స్ చెప్పాడు రజనీ.కేంద్ర ప్రభుత్వం తనకు ఈ ప్రెస్టీజియస్ అవార్డు ఇవ్వడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూనే, కృతజ్ఞత తెలిపాడు.

ఈ సందర్భంగా రజనీ చేసిన కామెంట్స్ చర్చనీయాంశమవుతున్నాయి.

తనకు వచ్చిన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును తన గురువు డాక్టర్ కె.బాలచందర్, తన సోదరుడు సత్య నారాయణరావు, తన మిత్రుడు రాజ్ బహదూర్‌కు అంకితమిస్తున్నట్లు అనౌన్స్ చేశాడు.దాంతో హాల్ మొత్తం చప్పట్లతో మార్మోగింది.

తనలో ఉన్న నటుడిని మొట్టమొదటి సారి గుర్తించింది రాజ్ బహదూరేనని రజనీ తెలిపాడు.ఈ క్రమంలోనే తమిళ్ ప్రజలకు, తన అభిమానులకు థాంక్స్ చెప్పిన రజనీ.

ఆనాటి సంగతులు ఎప్పుడూ మరిచిపోనని చెప్పాడు.అలా రజనీ చెప్పడం చూసి చాలా మంది ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

దటీజ్ రజనీకాంత్ అని అనుకంటున్నారు.

ఆనాడు అనగా 1970లో బెంగళూరులో 10 ఏ నెంబర్ సిటీ బస్సులో తాను కండక్టర్‌గా ఉన్నానని, అప్పుడు తనలోని యాక్టింగ్ టాలెంట్‌ను గుర్తించింది తన ఫ్రెండ్ అయిన డ్రైవర్ రాజ్ బహదూర్ అని ప్రతీ సారి గుర్తు చేసుకుంటాడు రజనీకాంత్.

Telugu Dadasaheb, Balachander, Rajinifriend, Rajinikanth, Satyanarayana, Rajnika

రాజ్ బహదూర్ తరమడం వల్లే తాను చెన్నై ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌కు వచ్చానని, అలా తాను ఆర్టిస్టు కావాలని తన స్నేహితుడు రాజ్ బహదూర్ తన వేతనంలో రూ.200 పంపేవాడని గుర్తు చేసుకుంటుంటాడు.రాజ్ బహదూర్ కు వచ్చేది రూ.400 వేతనం కాగా అందులో సగం రూ.200 రజనీకాంత్‌కు పంపేవాడు.

Telugu Dadasaheb, Balachander, Rajinifriend, Rajinikanth, Satyanarayana, Rajnika

అటువంటి స్నేహితుడిని రజనీకాంత్ పదే పదే గుర్తు చేసుకుంటూనే ఉంటాడు.ఇకపోతే యాభై ఏళ్ల స్నేహం ఇంకా కొనసాగుతోందని, తన స్నేహితుడు రాజ్ బహదూర్‌ను ఎప్పుడూ కలుస్తుంటానని రజనీ చెప్తుంటాడు.తన మనసుకు ఇబ్బంది కలిగినపుడు లేదా ఏదేని ఇబ్బందులు వచ్చినపుడు ఫస్ట్ వెళ్లేది తన స్నేహితుడు రాజ్ బహదూర్ ఇంటికేనని రజనీకాంత్ చాలా సార్లు చెప్పాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube