ముగిసిన అన్నాత్తే జర్నీ.. మొత్తం వచ్చింది ఎంతంటే!

సూపర్ స్టార్‌ రజినీకాంత్‌ హీరోగా శివ దర్శకత్వంలో వచ్చిన అన్నాత్తే సినిమా మంచి ఓపెనింగ్స్ ను దక్కించుకుంది.దీపావళి కానుకగా తమిళనాట భారీ ఎత్తున విడుదల అయిన అన్నాత్తేను జనాలు విపరీతంగా ఆధరించారు.

 Rajinikanth Annatha Movie Closing Collections Details, Annatthhe, Rajnikanth, Pe-TeluguStop.com

కాని సినిమా పై జనాలు పెట్టుకున్న అంచనాలను అందుకునే స్థాయిలో శివ అన్నాత్తేను తీయలేక పోయాడు అనేది ప్రతి ఒక్కరి మాట.ఈ మాట మాట్లాడుకుంటూనే సినిమాను చూశారు.వసూళ్లను ఇచ్చారు.తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఈ సినిమా పెద్దన్నగా విడుదల అయ్యి అత్యంత దారుణమైన పరాజయం పాలయ్యింది.డిజాస్టర్‌ టాక్ ను దక్కించుకున్న పెద్దన్న సినిమా మొత్తం 15 కోట్లకు గాను కేవలం 4.28 కోట్లను మాత్రమే రాబట్టగలిగింది.ఏమాత్రం సినిమా ప్రభావం చూపించలేక పోవడంతో పాటు రజినీకాంత్‌ కు తెలుగు లో మరీ మార్కెట్‌ దిగజారే లా చేసింది అంటూ విమర్శలు వస్తున్నాయి.

ఇక సినిమా విడుదల అయ్యి రెండు వారాలు అయిన నేపథ్యంలో.

రేపు శుక్రవారం బాక్సాఫీస్ వద్దకు బ్యాక్ టు బ్యాక్ సినిమా లు వస్తున్న నేపథ్యంలో అన్నాత్తే ను పూర్తిగా తొలగించబోతున్నారు.పది నుండి 20 థియేటర్లలో మాత్రమే ఇక అన్నాత్తే కనిపిస్తుంది.

అవి కూడా మరో వారంలో కనిపించకుండా పోతాయి.మొత్తానికి అన్నాత్తే సినిమా తమిళనాడు.

తెలుగు రాష్ట్రాలు.కర్ణాటక ఇతర ప్రాంతాల్లో.

యూఎస్ ఇలా అంతటా కలిపి 154 కోట్ల గ్రాస్ వసూళ్లు నమోదు చేసింది.

Telugu Annatha, Annatthhe, Gross, Kollywood, Peddanna, Rajinikanth-Movie

అందులో షేర్‌ గా 79.6 కోట్ల రూపాయలు దక్కినట్లుగా తెలుస్తోంది.సినిమా బ్రేక్ ఈవెన్‌ కు దూరంగా ఉండి పోయింది.

తమిళ మీడియా వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా ను 102 కోట్లకు అమ్మడం జరిగింది.కాని అటు ఇటుగా 80 కోట్లు మాత్రమే రావడంతో దాదాపుగా 20 శాతం వరకు నష్టాలు వచ్చినట్లుగా చెబుతున్నారు.

రజినీకాంత్‌ తన కథల ఎంపిక విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిమానులు చెబుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube