అటకెక్కిన రజినీ సినిమా  

Rajinikanth Movie Shelved, Rajinikanth, Annaatthe, Kollywood News, Corona Virus - Telugu Annaatthe, Corona Virus, Kollywood News, Rajinikanth

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ఇటీవల దర్బార్ చిత్రంతో అదిరిపోయే సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా తరువాత రజినీ తన నెక్ట్స్ చిత్రాన్ని లైన్‌లో పెట్టే పనిలో ఉన్నాడు.

 Rajinikanth Annaatthe Corona Virus

దర్శకుడు శివ డైరెక్షన్‌లో రజినీ అన్నాతె చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా, లాక్‌డౌన్ కారణంగా ఈ సినిమా వాయిదా పడింది.

అయితే ఈ సినిమాను తొలుత దసరా కానుకగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించారు.

అటకెక్కిన రజినీ సినిమా-Gossips-Telugu Tollywood Photo Image

కానీ ప్రస్తుత పరిస్థితుల కారణంగా ఈ సినిమా షూటింగ్ ఇప్పట్లో తిరిగి మొదలయ్యే అవకాశం లేదని తెలుస్తోంది.

ప్రస్తుతం కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో సినిమా షూటింగ్‌లో పాల్గొనేందుకు రజినీ ఏమాత్రం ఆసక్తిగా లేడని తెలుస్తోంది.ఆయన ఆరోగ్యం విషయంలో ఎలాంటి రిస్క్ తీసుకోకూడదని నిర్ణయించుకున్నాడు.తమిళనాడులో కరోనా విజృంభన తారాస్థాయిలో ఉండటంతో రజినీ ఈ నిర్ణయం తీసుకున్నాడట.కరోనా మహమ్మారి పూర్తిగా అంతమయ్యాకే సినిమా షూటింగ్‌లలో పాల్గొనాలని తలైవా నిర్ణయించుకున్నాడు.

దీంతో అన్నాతె చిత్రం ఇప్పట్లో తిరిగి పట్టాలెక్కే సూచన కనిపించడమే కాదు, అసలు ఈ సినిమా అటకెక్కేసిందనే వార్తలు కోలీవుడ్‌లో జోరుగా వినిపిస్తున్నాయి.మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే అఫీషియల్‌గా అనౌన్స్‌మెంట్ వచ్చే వరకు ఆగాల్సిందే.

అయితే ఇదంతా కేవలం పుకారు మాత్రమే అని తలైవా ఫ్యాన్స్ అంటున్నారు.

#Annaatthe #Rajinikanth #Corona Virus

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Rajinikanth Annaatthe Corona Virus Related Telugu News,Photos/Pics,Images..