కొత్త సినిమా కోసం 90 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్న రజినీకాంత్, మురుగదాస్!  

Rajinikanth And Murugadoss Took Huge Remuneration For New Project-rajanikanth Next Movie,rajinikanth And Murugadoss

  • సూపర్ స్టార్ రజినీకాంత్ క్రేజ్ దేశ వ్యాప్తంగా ఎ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అతని సినిమా అంటే తక్కువ లో తక్కువ వంద కోట్ల బిజినెస్ గారంటీ గా జరిగిపోతుంది.

  • కొత్త సినిమా కోసం 90 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్న రజినీకాంత్, మురుగదాస్!-Rajinikanth And Murugadoss Took Huge Remuneration For New Project

  • అయితే ఈ మధ్య అతని ట్రాక్ రికార్డ్ అంతగా బాగోలేదనే చెప్పాలి. శంకర్ దర్శకత్వంలో వచ్చిన రోబో 2.ఓ సినిమా ఒక్కటే 600 కోట్లు కలెక్ట్ చేసి నిర్మాతలకి లాభాలు తెచ్చిపెట్టింది. అంతకు ముందు పా రజింత్ దర్శకత్వంలో వచ్చిన కబాలి, కాలా రెండు నిర్మాతలకి నష్టాలే మిగిల్చాయి.

  • తాజాగా కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వంలో వచ్చిన పేట కూడా ఎవరేజ్ టాక్ తో బయటపడింది. ఇదిలా వుంటే ప్రస్తుతం రజినీకాంత్ మురుగదాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు.

  • Rajinikanth And Murugadoss Took Huge Remuneration For New Project-Rajanikanth Next Movie

    ఈ సినిమాని లైకా ప్రొడక్షన్ నిర్మిస్తుంది. అయితే ఈ సినిమా కోసం రజినీకాంత్ ఏకంగా 60 కోట్ల పారితోషికం తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. అలాగే మురుగదాస్ కూడా 30 కోట్ల వరకు రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నాడని టాక్ వినిపిస్తుంది . ఇలా వీరిద్దరి రెమ్యునరేషన్ రూపంలోనే 90 కోట్లు ఖర్చయితే ఇక సినిమా బడ్జెట్ 200 కోట్ల దాటిపోవడం గారంటీ అనే టాక్ వినిపిస్తుంది. అంత బడ్జెట్ అనేసరికి ఇప్పుడు నిర్మాతలు కొంత టెన్సన్ పడుతున్నట్లు తెలుస్తుంది. మరి బడ్జెట్ విషయంలో రజిని, మురుగదాస్ నిర్మాతలని కనికరిస్తారా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.