సూపర్‌ స్టార్‌ మూవీకి ఎన్టీఆర్‌, రజినీల సపోర్ట్‌     2018-10-27   11:30:17  IST  Ramesh Palla

మలయాళ సినిమా పరిశ్రమలో 20 కోట్ల బడ్జెట్‌తో సినిమా అంటే వామ్మో అంత బడ్జెట్టా అంటారు. మలయాళ సినిమా పరిశ్రమ చిన్నది. అక్కడ సినిమా థియేటర్ల సంఖ్య తక్కువ, సినిమా బడ్జెట్‌ చాలా తక్కువ. క్వాలిటీ విషయంలో కూడా టాలీవుడ్‌ స్థాయికి ఆ సినిమాలు రావు. కాని ప్రస్తుతం మలయాళ సూపర్‌ స్టార్‌ మోహన్‌లాల్‌ చేస్తున్న ‘ఓడియన్‌’ చిత్రం ఏకంగా 150 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతుంది. రికార్డు స్థాయి బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రంను కేవలం మలయాళంలోనే కాకుండా తెలుగు, తమిళం, హిందీల్లో కూడా విడుదలకు ప్రయత్నాలు చేస్తున్నారు.

Rajinikanth And Jr NTR Voice Over For Odiyan Movie In Telugu Tamil-

Rajinikanth And Jr NTR Voice Over For Odiyan Movie In Telugu And Tamil

ఆయా భాషల్లో భారీ క్రేజ్‌ను తీసుకు వచ్చేందుకు ఆ భాషలకు చెందని స్టార్స్‌తో వాయిస్‌ ఓవర్‌ ఇప్పించేందుకు మోహన్‌లాల్‌ ప్రయత్నాలు చేస్తున్నాడు. భారీ ఎత్తున అంచనాల నడుమ రూపొందిన ఈ చిత్రంలో మోహన్‌లాల్‌ చాలా విభిన్నమైన గెటప్‌లో కనిపిస్తున్నాడు. ఆయన పాత్ర కూడా చాలా విభిన్నంగా ఉంటుంది. అందుకే ఈ చిత్రంలో పార్ట్‌ అయ్యేందుకు తెలుగు నుండి ఎన్టీఆర్‌, రజినీకాంత్‌ లు ఆసక్తి చూపుతున్నారు. వీరిద్దరు కూడా తెలుగు మరియు తమిళంలో వాయిస్‌ ఓవర్‌ ఇచ్చేందుకు ఓకే చెప్పినట్లుగా సమాచారం అందుతుంది.

తెలుగు స్టార్‌ ఎన్టీఆర్‌ ‘ఓడియన్‌’ చిత్రానికి వాయిస్‌ ఓవర్‌ చెప్పడానికి కారణం ఆయనకు మోహన్‌లాల్‌తో ఉన్న సన్నిహిత్యం. జనతా గ్యారేజ్‌ సమయంలో ఇద్దరికి మద్య సన్నిహిత సంబంధం ఏర్పడినది. ఇద్దరు కూడా మంచి స్నేహితులుగా మారిపోయారు. అందుకే ఓడియన్‌ చిత్రం కోసం ఎన్టీఆర్‌ తెలుగులో వాయిస్‌ ఓవర్‌ ఇస్తానంటూ మాటిచ్చాడట.

Rajinikanth And Jr NTR Voice Over For Odiyan Movie In Telugu Tamil-

ఇక తమిళ సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌తో మోహన్‌లాల్‌కు ఎప్పటి నుండో స్నేహం ఉంది. ఆ స్నేహంతో తమిళ వర్షన్‌కు డబ్బింగ్‌ చెప్పేందుకు ముందుకు వచ్చాడు. భారీ ఎత్తున అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.