రజినీ ఫేవరేట్‌ హీరోయిన్‌ ఎవరో తెలిస్తే అవాక్కయ్యి, రజినీ నిజంగా సూపర్‌ స్టార్‌ అంటారు   Rajinikanth All Time Favorite Heroin Is Fatafat Jayalaxmi     2018-12-02   10:59:34  IST  Ramesh P

సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ కెరీర్‌లో ఎంతో మంది హీరోయిన్స్‌తో నటించాడు. ఐశ్వర్యరాయ్‌, దీపిక పదుకునే వంటి బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్స్‌తో కూడా ఈయన నటించాడు. అయితే రజినీకాంత్‌కు మాత్రం ఆల్‌టైం ఫేవరేట్‌ హీరోయిన్‌ మాత్రం ఫటాఫట్‌ జయలక్ష్మినట. ఆమె పేరు కూడా ఎప్పుడు విన్నట్లుగా లేదు కదా, ఒక స్టార్‌ హీరోకు మరో స్టార్‌ హీరోయిన్‌ ఫేవరేట్‌ ఉంటుంది. కాని రజినీకాంత్‌కు మాత్రం తనతో కేవలం రెండు సినిమాలు నటించిన జయలక్ష్మి అంటే చాలా అభిమానమట.

తెలుగులో హీరోయిన్‌గా నటించిన జయలక్ష్మి తమిళంలో బాలచందర్‌ దర్శకత్వంలో పలు చిత్రాల్లో నటించింది. రజినీకాంత్‌తో ఆయన కెరీర్‌ ఆరంభంలో రెండు సినిమాలు చేసింది. అప్పటి నుండి కూడా ఆమెను నేను అభిమానిస్తున్నట్లుగా చెప్పుకొచ్చాడు. తాజాగా 2.ఓ చిత్రం విడుదల సందర్బంగా మీడియాతో మాట్లాడిన రజినీకాంత్‌ తన ఆల్‌టైం ఫేవరేట్‌ హీరోయిన్‌ గురించి ప్రస్థావించి అందరి దృష్టిని ఆకర్షించాడు.

Rajinikanth All Time Favorite Heroin Is Fatafat Jayalaxmi-Fatafat Jayalaxmi

ఎన్నో ఏళ్ల క్రితం తనతో నటించిన జయలక్ష్మిని ఇంకా గుర్తు పెట్టుకున్న రజినీకాంత్‌ను నిజంగా అభినందించాల్సిందే. హీరోయిన్‌గా ఆమెకు స్టార్‌ డం దక్కలేదు. కాని రజినీకాంత్‌ మనసులో చోటు దక్కించుకుని స్టార్‌ హీరోయిన్‌ కంటే ఎక్కువ అయ్యింది. ఫటాఫట్‌ జయలక్ష్మి కొన్ని కారణాల వల్ల ఆత్మహత్య చేసుకుంది.

Rajinikanth All Time Favorite Heroin Is Fatafat Jayalaxmi-Fatafat Jayalaxmi

అప్పట్లో ఆమె ఆత్మహత్య సంచలనం సృష్టించింది. మళ్లీ ఇన్నాళ్లకు ఆమెను రజినీకాంత్‌ గుర్తుకు తేవడం జరిగింది. ఆమెను తన ఫేవరేట్‌ అంటూ చెప్పడంతో రజినీకాంత్‌ మరోసారి నిజమైన సూపర్‌ స్టార్‌ అనిపించుకున్నాడు.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.