పోలీస్ గా రజినీకాంత్ ని చూపిస్తున్న మురుగదాస్  

20 ఏళ్ల తర్వాత పోలీస్ గా కనిపిస్తున్న రజినీకాంత్ .

Rajini As A Police Officer Role In His Next Movie-darbar Movie,next Movie,police Officer Role,rajini

రజినీకాంత్. ఈ పేరు వింటే వెంటనే సౌత్ ఇండియాలో కోట్లాది మంది విజిల్స్ వేసి కేకలు వేస్తారు. అంతటి చరిష్మా ఉన్న హీరోగా తనదైన ముద్ర వేసిన రజినీకాంత్ మార్కెట్ అతను ఊహించిన దానికంటే రెట్టింపు అయిపొయింది..

పోలీస్ గా రజినీకాంత్ ని చూపిస్తున్న మురుగదాస్-Rajini As A Police Officer Role In His Next Movie

ప్రస్తుతం సౌత్ లో ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే హీరోగా, అలాగే భారీ బడ్జెట్ చిత్రాలలో మాత్రమే కనిపించే హీరోగా రజినీకాంత్ ముద్ర పడిపోయింది. రజినితో సినిమా అంటే నిర్మాత వంద కోట్లు జేబులో పెట్టుకోవాల్సిందే. అంతలా సౌత్ ఇండియా మార్కెట్ ని శాసిస్తున్నాడు.

అయితే రజినీకాంత్ హీరోగా ఈ మధ్యకాలంలో తెరకెక్కుతున్న సినిమాలు ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రావడం లేదు. అతని మీద పెట్టిన పెట్టుబడికి, వస్తున్నా కలెక్షన్ కి అసలు సంబంధం ఉండటం లేదు. అయితే ఇది కేవలం రజినీకాంత్ ఇమేజ్ ని అందుకోలేక సాదాసీదా కథలతో సినిమాలు తెరకెక్కిస్తున్న దర్శకులదే తప్పని చెప్పాలి.

రజిని ఇమేజ్ ని ఈ మధ్యకాలంలో కరెక్ట్ గా ఉపయోగించుకున్న దర్శకుడు అంటే కేవలం శంకర్ మాత్రమే అని చెప్పాలి.

ఇదిలా ఉంటే ఇప్పుడు రజినీకాంత్ మరో స్టార్ దర్శకుడుతో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. కేవలం స్టార్ హీరోలతో సినిమాలు తీసే మురుగదాస్ దర్శకత్వంలో దర్బార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ని దర్శకుడు వదిలాడు.

రజిని తన స్టైల్ లో మాసివ్ లుక్ లో కనిపిస్తూ చుట్టూ, పోలీస్ వెపన్స్, అలాగే ముంబై అండర్ వరల్డ్ ఎలివేషన్ ఉంది. దీంతో రజినీకాంత్ ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు అనే విషయంపై క్లారిటీ ఇచ్చేసాడు. మరి 20 ఏళ్ల తర్వాత మళ్ళీ పోలీస్ అవతారం ఎత్తుతున్న రజినిని సౌత్ ఆడియన్స్ ఎ రేంజ్ లో రిసీవ్ చేసుకుంటారు అనేది చూడాలి.