కాపీ కాదు కాదు కాదు..!!

గత కొంత కాలంగా ఏ సినిమాను తీసుకున్న కాపీ గొడవ వినిపిస్తోంది.ఈ చిత్రాన్ని ఆ సినిమా నుండి కాపీ కొట్టారని, ఆ చిత్రాన్ని ఈ సినిమా నుండి కాపీ కొట్టారు అంటూ ప్రచారం జరుగుతూ వస్తోంది.

 Rajesh M Selva Says Thoongavanam Not  Remake Of Sleepless Night-TeluguStop.com

కొన్ని సినిమాలు కావాలని కాపీ చేసినప్పటికి, కొన్ని కాపీ కొట్టకున్నా కూడా విమర్శల పాలు అవుతున్నాయి.తాజాగా యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ నటించిన ‘చీకటి రాజ్యం’ చిత్రం ‘స్లీప్‌ లెస్‌ నైట్‌’ అనే ప్రెంచ్‌ చిత్రానికి కాపీ అంటూ గత కొన్ని రోజులుగా తమిళ మరియు తెలుగు మీడియాలో వార్తలు వస్తున్నాయి.

మీడియాలో వస్తున్న వార్తలను చిత్ర దర్శకుడు రాజేష్‌ ఎమ్‌ సెల్వ తోసిపుచ్చాడు.ఈ చిత్రం తన సొంత కథతో తెరకెక్కించాను అని, ఆ ప్రెంచ్‌ సినిమాకు ‘చీకటి రాజ్యం’కు ఎలాంటి సంబంధం ఉండదు అంటూ తేల్చి చెప్పాడు.

మీడియాలో వస్తున్న వార్తలను ఇప్పటికి అయినా ఆపేయాలని సెల్వ కోరాడు.కమల్‌ శిష్యుడు అయిన సెల్వ మొదటి సారి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.

భారీ అంచనాల నడుమ వైవిధ్యభరిత కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రంలో కమల్‌ హాసన్‌తో పాటు ప్రకాష్‌ రాజ్‌, త్రిషలు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.వచ్చే నెలలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయి.

సినిమా విడుదలైతే కాని ఈ చిత్రం ‘స్లీప్‌ లెస్‌ నైట్‌’కు కాపీనా కాదా అనేది తేలనుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube