భారతీయుడి సత్తాపై నమ్మకం.. వరుసగా రెండోసారి కీలక బాధ్యతలు: లండన్‌ మేయర్ ఆదేశాలు

ఇటీవల లండన్ మేయర్‌గా ఎన్నికైన సాదిక్ ఖాన్.భారత సంతతి వ్యక్తి, పారిశ్రామిక వేత్త రాజేశ్ అగర్వాల్‌కు మరోసారి కీలక బాధ్యతలు అప్పగించారు.

 Rajesh Agrawal Re Appointed Londons Deputy Mayor For Business-TeluguStop.com

ఆయనను డిప్యూటీ మేయర్ ఫర్ బిజినెస్‌గా ఎంపిక చేస్తున్నట్లు సాదిక్ ఖాన్ ప్రకటించారు.రాజేశ్ ఈ పదవిని చేపట్టడం ఇది వరుసగా రెండోసారి.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.గడిచిన ఐదేళ్లకాలంలో కరోనా వంటి మహమ్మారిపై తాము పోరాటం చేశామని గుర్తుచేసుకున్నారు.

 Rajesh Agrawal Re Appointed Londons Deputy Mayor For Business-భారతీయుడి సత్తాపై నమ్మకం.. వరుసగా రెండోసారి కీలక బాధ్యతలు: లండన్‌ మేయర్ ఆదేశాలు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తన సామర్ధ్యంపై నమ్మకంతో వరుసగా రెండోసారి ఈ బాధ్యతలు అప్పగించినందుకు గాను మేయర్ సాదిక్ ఖాన్, లండన్ ప్రజానీకానికి రాజేశ్ కృతజ్ఞతలు తెలిపారు.మ‌ధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కి చెందిన రాజేష్ .లండన్‌కు వలస వచ్చి పారిశ్రామికవేత్తగా స్థిరపడ్డారు.2001లో యూకేకు చేరుకున్న ఆయన రేషనల్ ఐఎఫ్ఎక్స్, ఎక్స్‌ఎండ్ పే అనే చిన్న స్థాయి ఫారిన్ ఎక్స్చేంజ్, నగదు బదిలీ సంస్థలను స్థాపించి అతిపెద్ద కంపెనీలుగా తీర్చిదిద్దారు.ఈ సంస్థలు లండన్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి.ప్రతిపక్ష లేబర్ పార్టీ అనుబంధ లేబర్ ఫ్రెండ్స్ ఆఫ్ ఇండియా (ఎల్ఎఫ్ఐఎన్) డయాస్పోరా ప్రతినిధి బృందానికి రాజేశ్ కో చైర్‌గా వ్యవహరిస్తున్నారు.

కాగా, లండన్ మేయర్‌గా సాదిక్ ఖాన్ రెండోసారి ఎన్నికయ్యారు.పాకిస్తాన్ సంతతికి చెందిన 51 ఏళ్ల సాదిక్ ఖాన్ లేబర్ పార్టీ నుంచి రెండోసారి ఈ పీఠాన్ని అధిరోహించారు.స్థానిక ఎన్నికల్లో లేబర్ పార్టీ సత్తా చాటలేకపోయింది.అయితే లేబర్ పార్టీ తరుపున సాదిక్ ఖాన్‌ రాజధాని లండన్ నగరాన్ని కైవసం చేసుకోవడంతో ఆపార్టీకి కొంత ఊరట లభించినట్లయింది.

సాదిక్ ఖాన్ 2016 ఎన్నికల్లో మొదటిసారి లండన్ మేయర్‌గా ఎన్నికయ్యారు.తద్వారా లండన్‌కు తొలి ముస్లిం మేయర్‌గా రికార్డుల్లోకెక్కారు.ఈసారి ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ సారథ్యంలోని కన్జర్వేటివ్ పార్టీకి చెందిన షాన్ బెయిలీని ఓడించి రెండో సారి లండ‌న్ మేయ‌ర్‌గా పగ్గాలు చేపట్టారు.సాదిక్‌ ఖాన్‌కు 55.2 శాతం ఓట్లు రాగా, కన్జర్వేటివ్ పార్టీ అభ్యర్థి బెయిలీకి 44.8 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి.

అయితే, ఈసారి సాదిక్ ఖాన్ మెజారిటీ గతం కంటే భారీగా పడిపోవడం లేబర్ వర్గాల్లో చర్చకు దారితీసింది.ప్రజలకు ఉపాధి కల్పించడంతో పాటు నగరంలో పర్యాటకం, ఆర్థిక వ్యవస్థను వేగవంతం చేయడంపై దృష్టి సారిస్తానని సాదిక్ ఖాన్‌ వెల్లడించారు.

#London'sFirst #London'sDeputy #Rajesh Agrawal #LFIN #RajeshAgrawal

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు