'అదిగో' ఆ 'పంది' గొంతు రాజేంద్రుడిదే !     2018-10-27   18:35:31  IST  Sai Mallula

అందరిలా సినిమాలు చేస్తే నేను రవిబాబు ని ఎందుకు అవుతాను అంటూ… చిత్ర విచితైనా కథాంశాలతో అందరిని ఆకట్టుకునే … రవి బాబు ఈ సరి పంది పిల్ల ను పెట్టి సినిమా పూర్తి చేసాడు. ఈ సినిమాకి సురేష్ బాబు నిర్మాత. ఇది ఓ పంది పిల్ల నేపథ్యంలో సాగే సరదా కథ. పందికి `బంటి` అనే పేరు పెట్టారు. ఈ బంటీకి రాజేంద్రప్రసాద్ గాత్రదానం చేశారు. బంటి మనసులో అనుకునే మాటలు.. రాజేంద్రప్రసాద్ నోటి నుంచి వినిపిస్తాయన్నమాట. ఇదో త్రీడీ యానిమేషన్‌చిత్రం.

Rajendraprasad Voice Over To Pig In Adigo Movie-

Rajendraprasad Voice Over To Pig In Adigo Movie

ఇండియాలోనే ఇప్పటి వరకూ ఇలాంటి ప్రయత్నం చేయలేదని చిత్రబృందం చెబుతోంది. చాలా ఏళ్ల నుంచీ ఈ సినిమా సెట్స్‌పైనే ఉండిపోయింది. సినిమా పూర్తయి కూడా చాలా రోజులైంది. మంచి రిలీజ్‌డేట్ కోసం ఇన్నాళ్లూ చిత్రబృందం ఎదురుచూసింది. ఇప్పుడు ఈసినిమాకి కొన్ని హంగులు అద్ది, కమర్షియల్ గానూ వర్కవుట్ అయ్యేలా జాగ్రత్త పడుతున్నారు.