ప్రేమలో పడిన జయప్రద, రాజేంద్రప్రసాద్.. కానీ..?

దశాబ్ద కాలం క్రితం తెలుగు ప్రేక్షకులు రొటీన్ మాస్ మసాలా సినిమాలను, మూస కథలను ఎక్కువగా ఇష్టపడేవారు.అయితే మారుతున్న కాలంతో పాటే ప్రేక్షకుల అభిరుచి కూడా మారుతోంది.

 Rajendra Prasad And Jayasudha Playing Love@60 Movie,  Love@60 Movie, Rajendra Pr-TeluguStop.com

ప్రస్తుతం ప్రేక్షకులు నవ్యత ఉన్న కథలకే ఎక్కువగా ఓటేస్తున్నారు.దీంతో దర్శక నిర్మాతలు సైతం కొత్తకొత్త కాన్సెప్ట్ లతో సినిమాలను తెరకెక్కించడానికి సిద్ధమవుతున్నారు.రాజేంద్రప్రసాద్, జయప్రద ప్రధాన పాత్రల్లో

” లవ్@60″

అనే సినిమా తెరకెక్కుతోంది.
60 సంవత్సరాల వయస్సులో ఒక జంట ప్రేమలో పడితే అనే వింత కానెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం.ప్రముఖ దర్శకుడు వీ ఎన్ ఆదిత్య ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారని ఓటీటీలో ఈ సినిమా విడుదల కానుందని తెలుస్తోంది. లాక్ డౌన్ నిబంధనల వల్ల థియేటర్లు మూతబడటంతో ప్రేక్షకులు ఎంటర్టైన్మెంట్ కోసం ఓటీటీలపై ఆధారపడ్డారు.

ప్రస్తుతం థియేటర్లు తెరుస్తున్నా ప్రేక్షుకులు థియేటర్లలో సినిమాలు చూడటానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదు.

Telugu Age, Vn Aditya, Jayasudha, Lockdown, Love, Rajendra Prasad, Rajendraprasa

త్వరలో ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను ఈ సినిమా దర్శకనిర్మాతలు అధికారికంగా ప్రకటించనున్నారు.కామెడీ ఎమోషన్స్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ కేవలం 25 రోజుల్లో జరగనుందని తెలుస్తోంది.సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తున్న రాజేంద్ర ప్రసాద్ చాలాకాలం తరువాత ఈ సినిమా కోసం మేకప్ వేసుకుంటున్నారని తెలుస్తోంది.

జయప్రద గత కొన్నేళ్ల నుంచి రాజకీయాలతో బిజీగా ఉండి సినిమాలకు దూరంగా ఉన్నారు.అయితే చాలా కాలం తర్వాత ఈ వెబ్ మూవీ కోసం జయప్రద ముఖానికి మేకప్ తీసుకున్నారు.

తక్కువ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది.గత కొన్నేళ్ల నుంచి పరిమితంగా సినిమాలు చేస్తున్న వి ఎన్ ఆదిత్య మళ్లీ వరుస అవకాశాలతో బిజీ అవుతున్నారు.

ఇప్పటికే సునీల్ తో ఒక వెబ్ మూవీని తెరకెక్కించిన వీ ఎన్ ఆదిత్య త్వరలో లవ్@60 షూటింగ్ తో బిజీ కానున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube