అయినా..' ఈటెల ' టీఆర్ఎస్ లోనే ఉండాలనుకున్నారా ? 

టిఆర్ఎస్ లో తనకు ఎన్నో అవమానాలు జరిగాయని, ఎప్పటి నుంచో కేసిఆర్ తనను దూరం పెడుతూనే వచ్చారని చెబుతూనే ఎన్నో సంచలన విమర్శలు చేస్తూ టీఆర్ఎస్ ను ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్న మాజీ మంత్రి బీజేపీ నేత ఈటెల రాజేందర్ ప్రస్తుతం హుజూరాబాద్ నియోజకవర్గం లో పాదయాత్ర నిర్వహిస్తున్నారు.టిఆర్ఎస్ ప్రభుత్వం తప్పిదాలను, కేసీఆర్ విధానాలను తప్పు పడుతూ పాదయాత్ర కొనసాగిస్తున్నారు.

 Rajenders Comments During The Padayatra Went Viral Etela Rajender, Telangana, Tr-TeluguStop.com

హుజూరాబాద్ నియోజకవర్గం లో తనను గెలిపించాలని కోరుతున్నారు.

అయితే నిన్న హుజూరాబాద్ నియోజకవర్గం లోని ఇల్లంతకుంట మండలంలోని మర్రి lవారి పల్లె సీతంపేట ప్రజలతో మాట్లాడిన ఈటెల రాజేందర్ ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు.

పార్టీలో ప్రశ్నించే వాళ్ళు ఉండొద్దు అని తన పై నిందలు వేసి బయటకు పంపించారని, తనంతట తానుగా హుజురాబాద్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయలేదని, రాజీనామా చేయాలని తనపై ఒత్తిడి తీసుకురావడంతోనే రాజీనామా చేసినట్లు రాజేందర్ చెప్పారు.అయితే ఇప్పుడు ఆ వ్యాఖ్యలపై రకరకాల విశ్లేషణలు మొదలయ్యాయి.

టిఆర్ఎస్ నేతల నుంచి రాజీనామా చేయాలని ఒత్తిడి రావడంతో నే రాజేందర్ రాజీనామా చేశారా ? లేకపోతే చేసి ఉండేవారు కాదా ? అసలు రాజీనామా చేయకూడదని ఎందుకు అనుకున్నారు ? ఉద్యమ కాలం నుంచి కెసిఆర్ తో పని చేసిన రాజేందర్ కు ఆయన ఎత్తుగడలు బాగా తెలిసే ఆయన రాజకీయ వ్యూహాలను తట్టుకోలేను అనుకునే రాజీనామా చేయకూడదు అనుకున్నారా ? పార్టీలో చాలా ఏళ్ల నుంచి తనకు అవమానాలు జరుగుతున్నాయని రాజేందర్ చెప్పడం పైన విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Telugu Etela Rajender, Hujurabad, Telangana-Telugu Political News

ఎప్పటి నుంచో అవమానాలు జరుగుతున్నా, రాజేందర్ ఎందుకు టిఆర్ఎస్ లోనే ఉండాల్సి వచ్చింది ? కేసీఆర్ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసే వరకు రాజేందర్ ఎందుకు బయటకు రాలేక పోయారు ఇలా అనేక ప్రశ్నలు ఇప్పుడు రాజేందర్ ను ఇరుకున పెడుతున్నాయి.తాను పార్టీ నుంచి వెల్లాలనుకొలేదు వాళ్లే పంపేశారు అన్న మాటలు ఇప్పుడు రాజేందర్ కే ఇబ్బందికరంగా మారాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube