నిర్ణయం మార్చుకున్న ' ఈటెల ' ? ప్లాన్ వర్కవుట్ అయ్యేనా ? 

టీఆర్ఎస్ రాజకీయ ఎత్తుగడలతో బిజెపి హుజురాబాద్ అభ్యర్థి ఈటల రాజేందర్ సతమతమవుతున్నారు .ముఖ్యంగా తన ప్రధాన అనుచరులను, తనని నమ్ముకుని మొదటి నుంచి తన వెంట నడుస్తూ తన విజయంలో భాగస్వాములు అవుతూ వస్తున్న వారిని టార్గెట్ చేసుకుని టిఆర్ఎస్ పెద్ద ఎత్తున చేరికలను ప్రోత్సహించడం, టిఆర్ఎస్ మంత్రులు,  ఎమ్మెల్యేలు కీలకమైన నాయకులు అంతా తనను టార్గెట్ చేసుకోవడం వంటి పరిస్థితులు ఆందోళనకరంగా ఉండటం వంటి కారణాలతో గతంలో తీసుకున్న నిర్ణయాలను ఈటెల రాజేందర్ మార్చుకున్నారు.

 Rajender Is Recruiting His Followers In The Bjp Who Have Joined The-trs Trs, Tel-TeluguStop.com

తనతో ఉంటూ తన వెంట బిజెపిలో చేరకుండా టీఆర్ఎస్ వైపు వెళ్లిన వారందరినీ మళ్లీ తన వైపు రానిచ్చేది లేదని,  బిజెపిలో చేర్చుకునేది లేదు అంటూ గతంలో రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
         దీంతో టీఆర్ఎస్ లో కి వెళ్ళిన రాజేందర్ అనుచరులు మళ్ళీ వెనక్కి వద్దామనుకున్నా , రాజేందర్ నిర్ణయంతో సైలెంట్ అయిపోయారు.

అయితే ప్రస్తుతం పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో రాజేంద్ర తన నిర్ణయాన్ని మార్చుకున్నారు.  టీఆర్ఎస్ లో చేరిన వారిని తిరిగి వెనక్కి రప్పించే ప్రయత్నం చేస్తున్నారు.టిఆర్ఎస్ నుంచి ఉప సర్పంచ్ రాజేందర్ సమక్షంలో బిజెపిలో చేరారు.దీంతో మళ్ళీ  టిఆర్ఎస్ నుంచి బీజేపీలోకి రాజేందర్ వలసలను ప్రోత్సహించారనే సంకేతాలు వెలువడ్డాయి.

తాజాగా వీణవంక మండలం శ్రీరాములు పేట ఉపసర్పంచ్ దామోదర్ రెడ్డి టిఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరారు.
   

Telugu Etela Rajender, Gellusrinivas, Hareesh Rao, Akarsh, Telangana, Telangana

   గతంలో ఆయన టిఆర్ఎస్ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సమక్షంలో టిఆర్ఎస్ లో చేరినా, ఇప్పుడు మళ్లీ ఈటెల రాజేందర్ సమక్షంలో బిజెపిలో చేరారు.ఇంకా అనేక మంది టిఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతూ ఉండడం తో, ఈ వ్యవహారాలను చాలా జాగ్రత్తగా టీఆర్ఎస్  గమనిస్తోంది.రాజేందర్ వైపు తమ పార్టీ లో చేరిన నాయకులు ఎవరూ వెళ్లకుండా మంత్రులు,  ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పగించింది.

   

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube