హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్, రాజీవ్ కనకాల, సుమ కొడుకు రోషన్ కనకాల కూడా నిర్మలా కాన్వెంట్ సినిమాతో టాలీవుడ్ లోకి నటులుగా ఎంట్రీ ఇచ్చారు.ఆ సినిమాలో నటులుగా ఇద్దరు మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు.
మరల నాలుగేళ్ల గ్యాప్ తీసుకొని ఇప్పుడు శ్రీకాంత్ కొడుకు రోషన్ రాఘవేంద్రరావు పెళ్ళిసందడి సినిమాతో హీరోగా తిరిగి రీఎంట్రీ ఇస్తున్నాడు.ఇక సుమ, రాజీవ్ కొడుకు రోషన్ కూడా హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు.
గత కొద్ది రోజులుగా రోషన్ కనకాల హీరోగా ఎంట్రీ కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.అయితే తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది.
జెబి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నూతన దర్శకుడు విజయ్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. తనయుడు హీరోగా ఎంట్రీ ఇవ్వబోతోన్న సందర్భాన్ని పురస్కరించుకుని రాజీవ్, సుమ ఇద్దరూ ఎంతో ఆనందంగా ఉన్నట్లుగా తెలిపారు.
మా అబ్బాయ్ రోషన్ కార్తీక్‌ని హీరోగా మీ ముందుకు తీసుకువస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉన్నాము.మీ ప్రేమ, ఆశీస్సులు మా అబ్బాయికి ఇవ్వండి.అని సుమ, రాజీవ్ కనకాల తెలియజేశారు.మూవీకి సంబంధించిన మరిన్ని విషయాలను త్వరలోనే తెలియజేస్తామని వారు తెలిపారు.
మొత్తానికి ఈ ఏడాది టాలీవుడ్ నుంచి ఇద్దరు వారసులు ఒకే సారి హీరోలుగా ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం మొదలు పెట్టారు.దేవదాస్ కనకాల ఎంతో మంది హీరోలని ట్రైనింగ్ ఇచ్చి ఇండస్ట్రీకి పరిచయం చేశారు.
అయితే రాజీవ్ కనకాల మాత్రం హీరో కాలేకపోయాడు.కానీ నటుడుగా మాత్రం రాజీవ్ కనకాల సక్సెస్ అయ్యాడు.
ఇప్పుడు ఆ ఫ్యామిలీ నుంచి మరో నట వారసుడు రోషన్ కార్తిక్ హీరోగా ఎంత వరకు సక్సెస్ అవుతాడు అనేది చూడాలి.