స్టూడెంట్ నెంబర్ 1 టైంలోనే రాజమౌళి బాహుబలి ఆలోచన

టాలీవుడ్ లో నెంబర్ వన్ దర్శకుడుగా తిరుగులేని ఇమేజ్ ని సొంతం చేసుకున్న దర్శక దిగ్గజం రాజమౌళి.కేవలం టాలీవుడ్ లోనే కాకుండా దేశ వ్యాప్తంగా ఉన్న గొప్ప దర్శకుల జాబితాలో రాజమౌళి టాప్ 5లో ఉండటం పక్కా అని చెప్పాలి.

 Rajeev Kanakala Share About Rajamouli Creative Levels-TeluguStop.com

తన ప్రతీ సినిమాకి తండ్రే కథ అందిస్తూ ఉండతాడు.ఒకసారి తండ్రి కథ చెప్పిన తర్వాత దాని మీద దర్శకుడుగా రాజమౌళి సుదీర్ఘంగా వర్క్ చేస్తాడు.

విజువల్ గా తెరపై ఎంత అద్భుతంగా సన్నివేశాలని, హీరోయిజం ఆవిష్కరించాలి అనే విషయాలపై ఆలోచిస్తూ ఉంటాడు.అలాగే ప్రస్తుతం తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్, గతంలో తీసిన బాహుబలి సినిమాలు రాజమౌళి 20 ఏళ్ల కల అనే విషయం తాజాగా రాజీవ్ కనకాల చెప్పుకొచ్చారు.

ఇండస్ట్రీలో రాజమౌళి, రాజీవ్ కనకాల మంచి ఆప్తులు రాజమౌళి కెరియర్ స్టార్ట్ చేసిన శాంతి నివాసం సీరియల్ లో రాజీవ్ కనకాల హీరో.ఆ తరువాత కూడా రాజమౌళి సినిమాలలో రాజీవ్ కనకాల కీలక పాత్రలు చేస్తూ వచ్చారు.

Telugu @ssrajamouli, Baahubali, Bahubali, Rajeev Kanakala, Rajeevkanakala, Rrr,

తాజాగా ఓ ఇంటర్వ్యూలో రాజమౌళి క్రియేటివ్ థాట్స్ గురించి రాజీవ్ కనకాల ఆసక్తికర విషయాలని పంచుకున్నాడు. స్టూడెంట్ నెం.1 సినిమా చేస్తున్న సమయంలోనే అప్పుడప్పుడు భారీ యాక్షన్ సన్నివేశాలు గ్రాఫిక్స్ సంబంధించిన విషయాలను రాజమౌళి వివరించే వాడు.అప్పుడు నాకు చెప్పిన చాలా సీన్స్ బాహుబలిలో చూపించాడు.20 ఏళ్ల నుండి ఆయన మనసులో నాటుకుని ఉన్న సీన్స్ ను బాహుబలిలో అద్బుతంగా ప్రజెంట్ చేశాడంటూ రాజీవ్ కనకాల చెప్పుకొచ్చాడు.చాలా కాలం క్రితం నుండి బాహుబలి కథ రాజమౌళి, ఆయన తండ్రి మద్య చర్చ జరుగుతూ వచ్చిందని రాజీవ్ కనకాల మాటలతో బయట పెట్టాడు.

అన్ని సంవత్సరాల సంఘర్షణ కనుక బాహుబలి ఇండియాస్ బిగ్గెస్ట్ విజువల్ వండర్ గా నిలిచిందని చెప్పక తప్పదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube