భర్తతో కలిసి రచ్చరచ్చ చేసిన సుమ.. వీడియో వైరల్..?

బుల్లితెర స్టార్ యాంకర్లలో ఒకరైన సుమ సంవత్సరాలు గడుస్తున్నా, కొత్త యాంకర్ల నుంచి పోటీ ఎదురవుతున్నా కొత్త షోలతో బిజీ అవుతున్న సంగతి తెలిసిందే.కరోనా ఉధృతి తగ్గడంతో సుమ ప్రీ రిలీజ్ ఈవెంట్లతో మళ్లీ బిజీ అవుతున్నారు.

 Rajeev Kanakala Romance With Anchor Suma In Rechipodam Brother Show, Rajeev Kana-TeluguStop.com

అయితే షోలతో బిజీగా ఉన్నప్పటికీ సుమ రాజీవ్ కనకాల బుల్లితెరపై చేస్తున్న రెచ్చిపోదాం బ్రదర్ షోకు సుమ గెస్ట్ గా హాజరయ్యారు.గతంలో సుమ హోస్ట్ చేస్తున్న కొన్ని షోలకు రాజీవ్ హాజరై సందడి చేసిన సంగతి తెలిసిందే.

సుమ, రాజీవ్ కనకాల విడిపోయినట్లు గతంలో వార్తలు తెగ వైరల్ అయినా వీళ్లిద్దరూ షోలలో సందడి చేస్తూ వైరల్ అవుతున్న గాసిప్స్ కు చెక్ పెట్టారు. ఈటీవీ ప్లస్ ఛానల్ లో త్వరలో ఈ షో ప్రసారం కానుండగా ఇప్పటికే విడుదలైన ప్రోమోలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.

ఈ షో జబర్దస్త్, పటాస్ షోలను పోలి ఉండగా ఆ షోలలా ఈ షో కూడా సక్సెస్ అవుతుందేమో చూడాల్సి ఉంది.

లవ్ స్టోరీ సినిమాలో హిట్టైన దాని కుడి భుజం మీద కడవా పాటకు రాజీవ్ కనకాల, సుమ కనకాల కలిసి స్టెప్పులు వేయడంతో పాటు షోలో రచ్చరచ్చ చేశారు.రాజీవ్ కనకాల సుమ కనకాలను ఎత్తుకొని అందరినీ ఆశ్చర్యపోయేలా చేశారు.రెచ్చిపోదాం బ్రదర్ తొలి ఎపిసోడ్ లోనే సుమ కనిపిస్తారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

చాలా రోజుల తర్వాత సుమ రాజీవ్ కలిసి ఒకే షోలో సందడి చేయబోతున్నారు.

ఈ షోలో కొంతమంది జబర్దస్త్ కమెడియన్లు కనిపిస్తుండగా మరి కొంతమంది కొత్త కమెడియన్లు కనిపిస్తున్నారు.

ఈ మధ్య కాలంలో బుల్లితెరపై కామెడీ షోలకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ కామెడీ ప్రోగ్రామ్ లను ఎక్కువగా నిర్మిస్తూ ఉండటం గమనార్హం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube