అక్కడికి వెళితే నన్ను రాళ్లు, చెప్పులతో కొడతారు.. రాజీవ్ కామెంట్స్ వైరల్!

ఈ మధ్య కాలంలో తెలుగులో భారీ బ్లాక్ బస్టర్ సినిమా అంటే లవ్ స్టోరీ సినిమా మాత్రమే అని చెప్పాలి.రాజీవ్ కనకాల పాత్రతో ఇచ్చిన ట్విస్ట్ వల్ల లవ్ స్టోరీ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

 Rajeev Kanakala Opens About His Pain During The Time He Playing Narasimham Role-TeluguStop.com

సాయిపల్లవి బాబాయ్ నరసింహం పాత్రకు రాజీవ్ కనకాల పూర్తిస్థాయిలో న్యాయం చేశారు.ఈ సినిమాలోని పాత్రలో నటించడానికి రాజీవ్ కనకాల చాలా భయపడ్డారని శేఖర్ కమ్ముల, సుమ కనకాల ఇప్పటికే వెల్లడించిన సంగతి తెలిసిందే.

శేఖర్ కమ్ములను సినిమాలోని పాత్రను మేనమామగా మార్చాలని కోరానని కానీ ఎంత అడిగినా శేఖర్ కమ్ముల మాత్రం పాత్ర విషయంలో మార్పులు చేయడానికి అంగీకరించలేదని రాజీవ్ కనకాల చెప్పుకొచ్చారు.శేఖర్ కమ్ముల విలన్ రోల్ అని చెబితే రెగ్యులర్ రోల్ లాంటి పాత్రే అని తాను అనుకున్నానని ఆ తర్వాత చైల్డ్ మాలిస్టేషన్ సీన్ గురించి చెబితే తాను షాకయ్యానని రాజీవ్ కనకాల వెల్లడించారు.

Telugu Love Story, Nagachaitanya, Simham Role, Rajeev Kanakala, Sai Pallavi, Sai

ఆ క్యారెక్టర్ బాబాయ్ క్యారెక్టర్ కావడంతో పాత్ర మార్చమని కోరగా సమాజంలోని జరుగుతున్న వాస్తవాలనే తాను చూపించానని శేఖర్ కమ్ముల అన్నారని రాజీవ్ కనకాల పేర్కొన్నారు.ఇవి జరుగుతున్న వాస్తవాలే అని అయితే ఈ ఘటనలను సినిమాలో చూపిస్తే దారుణంగా ఉంటుందని రాజీవ్ కనకాల చెప్పుకొచ్చారు.హైదరాబాద్ లో ఉండేవాళ్లు తాను పాత్రను బాగా చేశానని చెబుతున్నారని రాజీవ్ కనకాల చెప్పుకొచ్చారు.

Telugu Love Story, Nagachaitanya, Simham Role, Rajeev Kanakala, Sai Pallavi, Sai

బీ, సీ సెంటర్లకు వెళితే తనను చెప్పులు, రాళ్లతో కొడతారని రాజీవ్ కనకాల కామెంట్లు చేశారు.లవ్ స్టోరీ సినిమాలోని పాత్రను నిజమేనని భావించి తనను అలాంటి వ్యక్తి అనే అనుకుంటారని రాజీవ్ కనకాల వెల్లడించారు.కొంతమంది నెటిజన్లు రాజీవ్ కనకాల తన పాత్రను అద్భుతంగా పోషించాడని అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube