రాజమౌళి మూవీకి తక్కువ రెమ్యునరేషన్ ఇస్తానంటే ఒప్పుకోలేదు.. రాజీవ్ కామెంట్స్ వైరల్!

ప్రస్తుతం దేశం గర్వించదగ్గ డైరెక్టర్లలో దర్శకధీరుడు రాజమౌళి ఒకరనే సంగతి తెలిసిందే.స్టూడెంట్ నంబర్1 సినిమాతో రాజమౌళి కెరీర్ మొదలైంది.

 Rajeev Kanakala Comments Goes Viral In Social Media Details, Rajeev Kanakala, Ra-TeluguStop.com

తాజాగా ఒక ఇంటర్వ్యూలో రాజమౌళి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.బాపూగారి రాంబంటు సినిమా నాకు మంచి పేరును తెచ్చిపెట్టిందని ఆయన తెలిపారు.

నాన్నగారి డైరెక్షన్ లో ఏ గూటి చిలక ఆ గూటి పలుకు, డ్యామిట్ కథ అడ్డం తిరిగింది.రాజశేఖర్ చరిత్రలలో చేశానని రాజీవ్ కనకాల తెలిపారు.

స్టూడెంట్ నంబర్1 సినిమా తర్వాత హీరోగా కొన్ని సినిమాలు చేశానని ఆయన అన్నారు.ఎ ఫిల్మ్ బై అరవింద్ సినిమాలో చేసిన పాత్రకు మంచి మార్కులు పడ్డాయని రాజీవ్ చెప్పుకొచ్చారు.

దూరదర్శన్ కు ఒక షూట్ చేసి వెళ్లిన సమయంలో తొలిసారి సుమను చూశానని 1999 సంవత్సరంలో సుమతో పెళ్లి జరిగిందని రాజీవ్ కనకాల వెల్లడించారు.స్టూడెంట్ నంబర్1 సినిమాలో విలన్ రోల్ కు చేసే ఛాన్స్ వచ్చిందని విలన్ పాత్రకు కొత్తవారు కావాలనుకున్నా రాజమౌళి మాత్రం నేనే కావాలని చెప్పారని రాజీవ్ కనకాల తెలిపారు.

స్టూడెంట్ నంబర్1 సినిమాకు మొదట పారితోషికం తక్కువగా ఇస్తానని చెప్పడంతో ఒప్పుకోలేదని అయితే రాజమౌళి నన్ను ఒప్పించారని రాజీవ్ కనకాల చెప్పుకొచ్చారు.

Telugu Ntr, Rajamouli, Rajeev Kanakala, Studnet Number, Suma Kanakala-Movie

అప్పటినుంచి జూనియర్ ఎన్టీఆర్ తో, రాజమౌళితో స్నేహం కొనసాగుతోందని రాజీవ్ కనకాల కామెంట్లు చేశారు.లవ్ స్టోరీ సినిమాలో బాబాయ్ రోల్ లో నటించడానికి ఇబ్బంది పడ్డానని రాజీవ్ కనకాల చెప్పుకొచ్చారు.

Telugu Ntr, Rajamouli, Rajeev Kanakala, Studnet Number, Suma Kanakala-Movie

సుమ మద్దతు ప్రతి విషయంలో ఉంటుందని రాజీవ్ అన్నారు.అబ్బాయి బీకాం చదివాడని అమ్మాయి యాంకర్ గా చేస్తుందేమో అని రాజీవ్ కనకాల కామెంట్లు చేశారు.నాకు సినిమాలు కావాలని ఎవరినీ అడగనని పాత్రకు న్యాయం చేస్తాననిపిస్తే నాకు ఛాన్స్ ఇస్తారని ఆయన తెలిపారు.

డైరెక్షన్ చేయాలనే ఆలోచన అయితే ఉందని ఆయన చెప్పుకొచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube