సుమతో గొడవలపై స్పందించిన రాజీవ్ కనకాల.. ఏం చెప్పారంటే?

టాలీవుడ్ లోని బెస్ట్ కపుల్స్ లో రాజీవ్ కనకాల, సుమ కనకాల ఒక కపుల్ కాగా సుమ బుల్లితెర షోలతో బిజీగా ఉంటే రాజీవ్ కనకాల ఒకవైపు సినిమాలతో బిజీగా ఉంటూనే మరో బుల్లితెర షోలకు జడ్జిగా వ్యవహరిస్తూ ఉండటం గమనార్హం.సుమ, రాజీవ్ కనకాల మధ్య విభేదాలు ఉన్నాయని గతంలో వార్తలు వచ్చాయి.

 Rajeev Kanakala Comments About Relation Ship With Suma Kanakala-TeluguStop.com

తాజా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన రాజీవ్ కనకాల సుమతో విభేదాల గురించి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

సుమతో బేధాభిప్రాయాల గురించి మాట్లాడుతూ తమ గురించి వేరే రకంగా న్యూస్ బయటకు వచ్చినా అందులో నిజం లేదని చెప్పారు.

 Rajeev Kanakala Comments About Relation Ship With Suma Kanakala-సుమతో గొడవలపై స్పందించిన రాజీవ్ కనకాల.. ఏం చెప్పారంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

న్యూస్ ఒకరి నుంచి మరొకరికి మారే సమయంలో మారుతుందని రాజీవ్ కనకాల పేర్కొన్నారు.తమ మధ్య పెద్దపెద్ద గొడవలు అయితే జరగలేదని దాంపత్యం అంటే షడ్రుచులు ఉంటాయని రాజీవ్ కనకాల అన్నారు.

కొడుకును నటుడిని చేయాలని తమ కోరిక అని రాజీవ్ కనకాల వెల్లడించారు.

గుర్రాన్ని చెరువు వరకు తీసుకెళ్లగలమని రాజీవ్ కనకాల కామెంట్లు చేశారు.

అనీష్ కురువిల్లా డైరెక్షన్ లో ఒక వెబ్ సిరీస్ లో తన కొడుకు నటిస్తున్నాడని ఒక కథ నచ్చినా తన కొడుకుకు వయస్సుకు మించిన పాత్ర కావడంతో నో చెప్పానని రాజీవ్ కనకాల తెలిపారు.నారప్ప మూవీ గురించి మాట్లాడుతూ ఈ సినిమా కోసం ప్రియమణి యాస నేర్చుకున్నారని రాజీవ్ కనకాల వెల్లడించారు.

Telugu Kartheek Ratnam, Rajeev Kanakala, Sensational Comments, Suma Kanakala-Movie

వెంకటేష్ అందరితో సరదాగా ఉంటారని కార్తీక్ రత్నం, రాఖీ బాగా చేశారని రాజీవ్ వెల్లడించారు.తన పాత్ర పేరు బసవయ్య అని వెంకటేష్ కాళ్లకు బొబ్బలు వచ్చాయని రాజీవ్ కనకాల చెప్పారు.అమెజాన్ ప్రైమ్ లో నారప్ప సినిమాను చూడాలని రాజీవ్ కనకాల కోరారు.నారప్ప సినిమా ఇప్పటికే విడుదలై పాజిటివ్ టాక్ ను సంపాదించుకున్న సంగతి తెలిసిందే.

#Suma Kanakala #Comments #Kartheek Ratnam #Rajeev Kanakala

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు