ట్రైన్ బాత్ రూమ్ దగ్గర పడుకున్న రాజీవ్ కనకాల.. డబ్బులు లేకపోవడంతో?

సాధారణంగా సినిమా ఇండస్ట్రీకి చెందిన వారి కొడుకు, కూతుళ్లకు సులభంగా ఆఫర్లు వస్తాయి.అయితే రాజీవ్ కనకాల మాత్రం బ్యాక్ గ్రౌండ్ ఉన్నా స్వయంకృషితో ఎదగడానికి సినిమాల్లో అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఎంతో కష్టపడ్డారు.

 Rajeev Kanakala Comments About His Career Troubles In Cine Industry, 40 Times, C-TeluguStop.com

మొదట క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ లోని ఒక సినిమాలోని పాత్ర కోసం ఎంపికయ్యానని రాజీవ్ కనకాల తెలిపారు.మొత్తం 40 రోజుల డేట్లు తీసుకున్నారని రాజీవ్ కనకాల చెప్పారు.

తనకు ఛాన్స్ రావడంతో దశ తిరిగిపోయిందని భావించానని రాజీవ్ కనకాల చెప్పుకొచ్చారు.1200 మంది అడిషన్ కు రాగా 700 మంది ఎంపికయ్యారని తాను కూడా ఈ సినిమాలో జూనియర్ ఆర్టిస్ట్ లాంటి పాత్రలో నటిస్తున్నానని అనుకున్నానని రాజీవ్ కనకాల చెప్పుకొచ్చారు.40 రోజులు వెనుక తిరిగే పాత్రనే అని భావించి 10 రోజుల తర్వాత తాను షూటింగ్ కు వెళ్లలేదని రాజీవ్ కనకాల చెప్పుకొచ్చారు.

Telugu Times, Career Troubles, Problems, Mammooty, Rajeev Kanakala, Suman-Movie

ఛార్జీలకు ప్రొడక్షన్ వాళ్లు డబ్బులు ఇచ్చేవారని నాన్నను అడిగేవాడిని కాదని రాజీవ్ కనకాల చెప్పుకొచ్చారు.సూర్యపుత్రులు సినిమాలో ఒక సీన్ షూటింగ్ బ్యాలెన్స్ ఉందని మమ్ముట్టి, సుమన్ కలిసి ఆ సీన్ లో తాను కూడా ఉండాలని రాజీవ్ కనకాల అన్నారు.వాళ్ల డేట్ కలయిక కోసం తాను 40సార్లు చెన్నైకు వెళ్లానని పొద్దునే వెళ్లి దిగేవాడినని రాజీవ్ కనకాల వెల్లడించారు.4.30కు షూటింగ్ లేదని చెబితే ఛార్మినార్ ఎక్స్ ప్రెస్ ఎక్కేవాడినని రాజీవ్ కనకాల తెలిపారు.

Telugu Times, Career Troubles, Problems, Mammooty, Rajeev Kanakala, Suman-Movie

ట్రైన్ ఎక్కితే అన్నీ ఖర్చీఫ్ లు ఉండేవని అందరూ ఇరుకిరుకుగా కూర్చునే వారని రాజీవ్ కనకాల అన్నారు.తాను ప్లేస్ లేకపోవడం వల్ల బాత్ రూమ్ దగ్గర కూర్చునేవాడినని కొన్నిసార్లు నిద్రొచ్చి పడుకునేవాడినని ఒక్క సీక్వెన్స్ కోసం 40సార్లు చెన్నైకు వెళ్లాల్సి వచ్చిందని రాజీవ్ కనకాల పేర్కొన్నారు.అలా బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ తాను అనుభవించిన కష్టాల గురించి రాజీవ్ కనకాల చెప్పుకొచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube