గొడవ జరిగింది అని, జైలు లో ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన రాజీవ్ హంతకురాలు

గత 29 సంవత్సరాలుగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషిగా తేలిన నళిని ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే.భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో నిందితురాలు గా ఉన్న నళిని శ్రీహరన్ వేలూరు మహిళా జైలు లో శిక్ష అనుభవిస్తుంది.

 Rajeev Gandhi Murderer Nalini Sucide Attempt In Jail, Nalini, Rajivi Gandhi, Nal-TeluguStop.com

ఇటీవల కుమార్తె వివాహం కోసం 30 రోజుల పాటు పెరోల్ పై బయటకు వచ్చిన నళిని పెరోల్ గడువు ముగియడం తో తిరిగి జైలులోనే శిక్షను అనుభవిస్తుంది.అయితే తోటి ఖైదీ తో గొడవ చోటుచేసుకోవడం తో ఉరివేసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించినట్లు తెలుస్తుంది.

అయితే ప్రస్తుతం ఆమె ఆరోగ్యపరిస్థితి మెరుగ్గానే ఉందని , అయితే అసలు జైలు ఏమి జరిగింది అన్న దానిపై వివరణ ఇవ్వాలి అంటూ ఆమె తరపు న్యాయవాది పుహళేంది డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తుంది.తోటి మహిళా ఖైదీలతో చోటుచేసుకున్న వాగ్వివాదం కారణంగా మనస్థాపానికి గురైన నళిని జైలు లోనే ఆత్మహత్యాయత్నానికి యత్నించినట్లు సమాచారం.

అయితే అసలు జైలు లో ఏమి జరిగింది ఎందుకు ఆత్మహత్యకు పాల్పడింది అన్న దానిపై నళిని తరపు న్యాయవాది జైలు అధికారులను డిమాండ్ చేస్తున్నారు.తోటి ఖైదీకి, నళిని మధ్య జైలులో గొడవ జరిగిందని, దీంతో ఆ మహిళ విషయాన్ని జైలర్ దృష్టికి తీసుకెళ్లిందని పుహళేంది తెలిపారు.

ఆ వెంటనే నళిని ఆత్మహత్యకు యత్నించినట్టు పేర్కొన్నారు.

అయితే, గతంలో ఎప్పుడూ నళిని ఇలా ప్రవర్తించలేదని, ఇందుకు గల అసలు కారణాలు తెలుసుకుంటామన్నారు.

మరోపక్క నళిని ఆత్మహత్యాయత్నం గురించి విషయం తెలిసిన నళిని భర్త ఆమెను వేలూరు జైలు నుంచి పుళల్ జైలు కు తరలించేలా చూడాలని కోరారని, దానికి సంబంధించి త్వరలో కోర్టు ను కూడా ఆశ్రయిస్తామని నళిని తరపు న్యాయవాది వెల్లడించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube